గరుడ పంచమి
గరుడ పంచమి ప్రతియేటా శ్రావణ మాసంలో పంచమి తిథి నాడు వస్తుంది. ఈ రోజే నాగపంచమిగా కూడా జరుపుకుంటారు. ఈనాడు గరుత్మంతుని వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం కూడా ఉంది. ఈ వ్రతాన్ని సత్సంతానాన్ని పొందడానికి చేస్తారు. అలాగే సంతానం కలిగిన స్త్రీలు వారి పిల్లల ఆరోగ్య అభివృద్ధి కొరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు.
గరుత్మంతుని పంచమి రోజున తప్పకుండా సుపర్ణోపాఖ్యానం ( గరుత్మంతుని చరిత్ర ) చదవాలని పెద్దలు చెబుతారు. దీనివలన సత్సంతానము, సంతానాభివృద్ధి కలుగుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కింద ఉన్న వీడియోలో ఎంతో అద్భుతంగా సుపర్ణోపాఖ్యానం ప్రవచించారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ గరుత్మంతుని చరిత్రను విని ఆ గరుడుడిని ఆశీస్సులు ఆ శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు మీకు కలగాలని మేము ఆకాంక్షిస్తున్నము.
ఈరోజు శ్రీమహావిష్ణువుని కూడా ఎంతో విశేషంగా ఆరాధిస్తారు. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం కనుక ఆయన ఎంతగానో సంతోషిస్తారు. గరుడ గమన తవ ఈ స్తోత్రాన్ని పఠించాలి లేదా వినాలి అనుకునేవాళ్లు గరుడ గమన తవ లింక్ ని క్లిక్ చేయండి.
1 thought on “గరుడ పంచమి – గరుత్మంతుని చరిత్ర”