శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండవ అవతారము శ్రీకూర్మ అవతారం. కూర్మ అవతారం లో స్వామిమికి ప్రపంచంలోనే ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం.
ఇక్కడ స్వామి వారిని దర్శించు కున్నవారికి శని గ్రహ దోషా లు, కుజ గ్రహ దోషాల తో పాటుగా, రాహు కేతు గ్రహ దోషాలు కూడా తొలుగుతాయి. ఇక్కడ వున్నశ్వేత పుష్కరిణి లో పితృకార్యం చేస్తే, వారికి మోక్షము కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి.
ఈ క్షేత్రం లో మన్ని ఆశ్చర్య పరచే ఎన్నో ప్రత్యేకత లు వున్నా యి. 108 దివ్య దేశాల లో ఒకటైన ఈ క్షేత్రం లో, స్వామి కూర్మనాధుకునిగా, ఆ శ్రీమహాలక్ష్మి కూర్మనాయకి గా వెలిశారు.
శ్రీ కూర్మనాధుని కథ
దేవతలు, రాక్షసులు, అమృతం కోసం పాల సముద్రంలో మందర పర్వతాన్ని చిలకభోగా, ఆ పర్వతం, పాలసముద్రం మధ్య లో పడిపోయింది.
దానితో దేవతలు విష్ణు మూర్తిని ప్రార్ధించారు. ఆయన కూర్మరూపం లో అంటే తాబేలు గా మారి ఆయన వీపు మీద ఆ పర్వతాన్ని భరించి, అమృతోత్పాదనలో సహాయం చేసారు.
ఈ అవతారాన్ని స్వామి జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు స్వీకరించారని పద్మపురాణం చెబుతుంది. ఇలా ఆ శ్రీ మహావిష్ణు తీసుకున్న రెండవ అవతార మే కూర్మావతారం.
శ్రీకూర్మం చరిత్ర
శ్వేత మహా రాజు తపస్సు కు మెచ్చిన ఆ శ్రీహరి ఇక్కడ కూర్మనాధునిగా, స్వయంభువుగా వెలిసారు.
అలాగే ఆయన సుదర్శన చక్రం ద్వారా ఇక్కడ శ్వేత పుష్కరిణి ఏర్పడింది. ఈ పుష్కరిణి బిలం లోని మార్గం నుండి లక్ష్మి దేవి కూర్మనాయకి గా వచ్చి ఇక్కడ వెలసినది.
ఈ ఆలయం లో స్వయంగా చతుర్ముఖ బ్రహ్మ గారు గోపాల యంత్రాన్ని స్థాపించారు. ఈ విషయము అన్ని మనకు పద్మపురాణం ఆధారం గా తెలుస్తున్నాయి.
సాధారణం గా ఆలయానికి కేవలం ఒక్క ధ్వజస్థంభం మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఆలయానికి రెండు ధ్వజ స్థంబాలు ఉంటాయి.
దీనికి కారణం 11 వ శతాబ్దం లో భగవత్ శ్రీ రామానుజాచార్యులు ఆలయం పశ్చిమ వైపు కూర్చొని కూర్మనాధుని ధ్యానించారు. ఆయన భక్తి కి మెచ్చిన ఆ స్వామి వారి మూల మూర్తి కుడి వైపు నుండి పశ్చిమ ముఖం గా తిరిగింది. అందు చేత రామానుజాచార్యులు పశ్చిమ వైపు మరి యొక్క ధ్వజ స్థంబాన్ని ప్రతిష్టించారు.
ఇప్పటికీ మనకు ఇక్కడ స్వామి పశ్చిమ ముఖం గా తిరిగి, కూర్మ రూపం లో, సాలగ్రామ శిలగా దర్శనం ఇస్తారు.
స్వామి ఈ ఆలయం లో ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం వెలిశారని, అందుకే ఇక్కడ స్వామిని ఆది కూర్మ స్వామిగా పిలుస్తారని మనకు పురాణాలు చెబుతున్నాయి.
శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం ద్వారా శ్వేత పుష్కరిణి ఏర్పడింది. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ చవితి నాడు, వారణాసి నుండి అంతర్వాహినిగా గంగాదేవి, ఈ పుష్కరిణి కి వచ్చి, భక్తుల పాపాలను కడుగుతుంది.
కూర్మనాధుకుని ని దర్శించడానికి లవకుశులు, బలరాముడు, దూర్వాసవ మహర్షి, ఆదిశంకరాచార్య, భగవత్ రామానుజాచార్యులు ఇక్కడికి వచ్చార ని స్థలపురాణం చెబుతుంది.
శ్రీ కూర్మం ఆలయ విశేషాలు
శ్రీకూర్మం ఆలయం ఎన్నో విశేషాలతో నిండి వున్నది.
ఈ ఆలయ గర్భగుడి ప్రవేశము తూర్పు లేదా దక్షిణ ద్వారము ద్వారా చేయవచ్చు.
ఈ ఆలయం లో ఎంతో అద్భుతమైన శిల్పకళ తో 108 స్థంబాలు వున్నాయి. ఏ స్తంభము కూడా ఇంకొకదానిలా ఉండకపోవటమే వీటి ప్రత్యేకత. ఈ స్తంభాల మీద మనకి పాలి లిపి లో రాయబడిన విషయాలు ఇప్పటికి కనబడతాయి.
అలాగే మరి ఇతర ఏ ఆలయాలలో లేని విధం గా ఈ ఆలయం లో రెండు ధ్వజ స్థంబాలు ఉంటాయి.
శ్రీ వైష్ణవ దేవి ఆలయం కేవలం జమ్ము కాశ్మీర్ లోన మరియు శ్రీ కూర్మం ఆలయం లో నే ఉన్నవి.
ఈ ఆలయం లోని స్వరంగ మార్గం ద్వారా కాశికి చేరుకోవచ్చు. ఆ స్వరంగ మార్గ ద్వారాన్ని ఇప్పటికి మనం ఇక్కడ చూడవచ్చు.
ఈ ఆలయం లో పెద్ద జీయర్ స్వామి వారి చే నిర్మింపబడిన రామకోటి స్తూపం వున్నది.
ఆలయం లో తాబేళ్ళకోసం నిర్మించిన పార్కుని కూడా చూడవచ్చు.
స్వామి వారి దశావతారాల ఆయిల్ పేయింటింగ్ మరియు శిల్పాలు భక్తులను ఆకట్టుకుంటాయి.
ఇక్కడ వున్న శ్వేత పుష్కరిణి లో పితృతర్పణం చేస్తే, అస్థికలు నీటిలో కొన్నాళ్లకు రాళ్ళ గా మారుతాయి.
భక్తుల కోసం శ్రీకూర్మం దేవస్థానం వారు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు.
శ్రీ కూర్మం ఎలా వెళ్ళాలి
శ్రీ కూర్మం క్షేత్రం శ్రీకాకులం జిల్లా గార మండలం లో ఉంది. ఇక్కడికి వెళ్ళాలి అనుకునే భక్తులు ముందుగా శ్రీకాకుళం చేరుకోవాలి. మనకి తెలుగు రాష్ట్రాల నుండి శ్రీకాకులానికి అనేక రైలు మరియు బస్సులు ఉన్నాయి.
శ్రీకాకుళం బస్టాండ్ నుండి మనకి సుమారుగా 17km దూరంలో ఈ శ్రీ కూర్మం క్షేత్రం ఉన్నది. మనకి శ్రీకాకుళం బస్టాండ్ నుండి బుస్స్ మరియు ఆటోలు అందుబాటులో ఉంటాయి.
శ్రీకూర్మమ్ వసతి
శ్రీకూర్మమ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు శ్రీకాకుళం లోనే వున్న ప్రైవేట్ హోటల్స్ లో ఉండాల్సి ఉంటుంది. మనకి శ్రీకాకుళం లో చాల హోటల్స్ ఉంటాయి. శ్రీకాకుళం నుండి గుడికి కేవలం 17నుండి 20KM కాబట్టి ఈజీగా వెళ్ళవచ్చు.
సింహాచలం ఆలయ పూర్తి వివరాలు
1 thought on “శ్రీకూర్మం ఆలయం”