గంగా పుష్కరాలు 2023
గంగా పుష్కరాలు 2023 లో 22 ఏప్రిల్ నుండి 3 మే వరకు జరగనున్నాయి. గంగా పుష్కరాలు 12 రోజులు జరుగుతాయి. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి గంగా పుష్కరాలు వస్తాయి. బృహస్పతి అశ్విని నక్షత్రం మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి.
గంగాపుష్కర ప్రాంతాలు
గంగాదేవి హిమాలయాల్లో ఉన్న గంగోత్రి వద్ద మొదలై కలకత్తాలోని గంగా సాగర్ వద్ద ఉన్న బంగాళాఖాతంలో కలుస్తుంది.
గంగ ప్రవహిస్తున్న ప్రాంతాలలో ఎన్నో విశేషమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. గంగాదేవి పుట్టిన స్థలమైనటువంటి గంగోత్రి మొదలుకొని ఆవిడ ప్రవహించిన అనేక తీరాల యందు పుణ్యక్షేత్రములు ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా చెప్పబడినవి ఇవి;
- గంగోత్రి
- దేవప్రయాగ
- హరిద్వార్
- రిషికేష్
- వారణాసి
- ప్రయాగ్ రాజ్
- గంగా సాగర్
ఈ పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ అత్యంత శక్తివంతమైనది వారణాసి అనగా కాశి. వీటితో పాటు మనకి మరికొన్ని గంగా పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. అవి ఏమిటంటే
- అలహాబాద్.
- పాట్నా
- కాన్పూర్
- లక్నో
గంగా పుష్కరాలకు ఏ విధంగా వెళ్ళాలి
మన తెలుగు రాష్ట్రాలనుండి, గంగా పుష్కరాలకు ఏ విధంగా వెళ్లాలో తెలుసుకుందాం.
వారణాసికి / కాశి ఏ విధంగా వెళ్ళాలి?
వారణాసి/ కాశి క్షేత్రము ఎంతో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. గంగా దేవి ఆవిర్భవించినది గంగోత్రి అందు అయినా, కాశీ గంగయే విశేషమైనదని పెద్దలు చెబుతారు. ఈ కాశీక్షేత్రానికి హైదరాబాదు, విజయవాడ, మరియు విశాఖపట్నం నుండి ఎలా వెళ్లాలో ఈ కింద తెలుపబడిన.
హైదరాబాదు నుండి వారణాసికి/ కాశీకి
హైదరాబాద్ నుండి వారణాసికి రైలు మార్గంలో కాని, విమానంలో కాని వెళ్ళవచ్చు.
మనకి హైదరాబాదు నుండి వారణాసికి రోజు ప్రయాణించే ఒక రైలు ఉన్నది, దాని వివరాలు కింద గమనించగలరు.
రైలు పేరు: SC DNR SF EXP (12791)
రైలు ప్రయాణించే రోజులు: ప్రతి రోజు
రైలు సమయం సికింద్రాబాద్ నుండి ఉదయము 09:25 (Day 1)
రైలు వారణాసికి చేరుకునే సమయం మధ్యానం 13:30 (Day 2)
సికింద్రాబాద్ నుండి వారణాసికి రైలు యొక్క ప్రయాణ సమయం 28:05
హైదరాబాదు నుండి వారణాసికి ప్రయాణించే అనేక విమానాలు ఉన్నాయి. డైరెక్ట్ గా హైదరాబాదు నుండి వారణాసికి వెళ్లే విమాన ప్రయాణము సుమారుగా రెండు గంటలు.
విజయవాడ నుండి వారణాసికి/ కాశీకి
విజయవాడ నుండి వారణాసికి రైలు మార్గంలో కాని, విమానంలో కాని వెళ్ళవచ్చు.
మనకి విజయవాడ నుండి వారణాసికి రోజు మరియు వీక్లీ ప్రయాణించే రైలు ఉన్నవి, దాని వివరాలు కింద గమనించగలరు.
రైలు పేరు: GANGAKAVERI EXP (12669)
రైలు ప్రయాణించే రోజులు: ప్రతి రోజు
రైలు సమయం విజయవాడ నుండి అర్ధరాత్రి 23:55 (Day 1)
రైలు వారణాసికి చేరుకునే సమయం తెల్లవారుజామున 05:10 (Day 3)
విజయవాడ నుండి వారణాసికి రైలు యొక్క ప్రయాణ సమయం 29:15hrs
రైలు పేరు: ERS PNBE EXP (22669)
రైలు ప్రయాణించే రోజులు: ప్రతి ఆదివారము
సమయం విజయవాడ నుండి రాత్రి 20:00 (Day 1)
వారణాసికి రైలు చేరుకునే సమయం అర్ధరాత్రి 1:45 (Day 3)
విజయవాడ నుండి వారణాసికి రైలు యొక్క ప్రయాణ సమయం 29:45
విజయవాడ నుండి వారణాసికి ప్రయాణించే అనేక విమానాలు ఉన్నాయి. కానీ డైరెక్ట్ గా విజయవాడ నుండి వారణాసికి వెళ్లే విమానములు లేవు, మధ్యలో ఒక స్టాప్ లో ఆగి, వెళ్లే విమానాలు ఉన్నాయి. ఈ విమాన ప్రయాణ సమయము సుమారుగా ఎనిమిది గంటలు.
విశాఖపట్నం నుండి వారణాసికి/ కాశీకి
విశాఖపట్నం నుండి వారణాసికి రైలు మార్గంలో కాని, విమానంలో కాని వెళ్ళవచ్చు.
మనకి విశాఖపట్నం నుండి వారణాసికి వీక్లీ ప్రయాణించే రైలు ఉన్నవి.
ట్రైన్ : VSKP BSBS SPL (08588)
ట్రైన్ ప్రయాణించే రోజులు: ప్రతి బుధవారం
విశాఖపట్నం నుండి ట్రైన్ మధ్యానం 12:30 (Day 1)
వారణాసికి ట్రైన్ చేరుకునే సమయం సాయంత్రం 16:10 (Day 2)
విశాఖపట్నం నుండి వారణాసికి రైలు యొక్క ప్రయాణ సమయం 27:04hrs
విశాఖపట్నం నుండి వారణాసికి ప్రయాణించే అనేక విమానాలు ఉన్నాయి. కానీ డైరెక్ట్ గా విశాఖపట్నం నుండి వారణాసికి వెళ్లే విమానములు లేవు, మధ్యలో ఒక స్టాప్ లో ఆగి, వెళ్లే విమానాలు ఉన్నాయి. ఈ విమాన ప్రయాణ సమయము సుమారుగా ఎనిమిది గంటలు.
గంగోత్రి - హరిద్వార్ - రిషికేష్ - దేవప్రయాగలకు ఏ విధంగా వెళ్ళాలి?
మనకి గంగా పుష్కరాలు గంగోత్రి, హరిద్వార్, రిషికేష్ దేవప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో కూడా జరుగుతున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాలనుండి డైరెక్ట్ గా వెళ్లే రైలు లేదా విమాన మార్గాలు లేవు.
ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వాళ్లు ఢిల్లీ నిజాముద్దీన్ వరకు రైలు మార్గంలో వెళ్లి అక్కడినుండి బస్ లేదా కార్ మార్గంలో ఈ క్షేత్రాలను చేరుకోవాల్సి ఉన్నది. హరిద్వార్, రిషికేష్ క్షేత్రాలకు ఢిల్లీ నుండి రైలు మార్గం కూడా ఉంది.