కంచి కామాక్షి దేవాలయం దర్శనం
అయోద్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికా, పురి ద్వారకవతి శైవ సప్తైతతే మోక్షదాయక
భారతదేశాన్ని అంతటినీ ఒక ఆద్యాత్మిక కేంద్రంగా ఉపాసన చేసినటువంటి ఋషిలు ఈ 7 నగరాలను మోక్షపురాలుగా నిర్ణయం చేశారు.
మోక్షపురాలు 7 లో ఆరు ఉత్తర భారతదేశం లో ఉంటే ఒక్క కాంచిపురం ధక్షిణ భారతదేశం లో ఉంది
ఆ కాంచిపురం లో కామాక్షి పరదేవత స్వరూపం, లోకంలో వున్న అందరికీ కూడా కొంగు బంగారం అయింది.
ఆవిడ పేరు కామాక్షి ఐన కారణం చేత, తన కన్నుల చేత అందరి కోరికలు తీర్చిన కల్పవల్లి గా భాసించింది.
ఈ దేవాలయంలో కామాక్షి అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగాముద్రలో పద్మాసనం పై ఆసీనురాలై దర్శనం ఇస్తున్నారు
ప్రతి దేవాలయంలో అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం ఒక దగ్గర ఉండి భక్తులకు దర్శనం ఇస్తారు.
కానీ ఈ దేవాలయం లో కామాక్షి అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వగా, దగ్గర్లోనే ఏకామ్రేశ్వరస్వామి దేవాలయం ఉంటుంది.