# SBL Bhakthi > Dharmo Rakshati Rakshitah ## Posts - [గోదా దేవి కథ, కళ్యాణం మరియు ఆధ్యాత్మిక రహస్యాలు](https://sblbhakthi.in/goda-devi-katha-kalyanam-significance/): హిందూ ధర్మంలో భక్తికి, మరియు ఆత్మ సమర్పణకు నిలువుటద్దం గోదా దేవి (ఆండాళ్). విష్ణుచిత్తుల (పెరియాళ్వార్) పుత్రికగా, తులసి వనంలో అయోనిజగా జన్మించిన గోదా దేవి, మానవ మాత్రుడిని పెళ్ళి చేసుకోనని భీష్మించుకుని, ఆ రంగనాథునే పతిగా పొందింది. గోదా దేవి కళ్యాణం వెనుక ఉన్న అంతరార్థాన్ని, మరియు ఆమె జీవితం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలను కథా రూపంలో తెలుసుకుందాం. గోదా దేవి కథ: భక్తి సామ్రాజ్యపు పట్టాభిషిక్తురాలు శ్రీవిల్లిపుత్తూరులోని తులసి వనంలో లభించిన చిన్నారి గోదా, పెరియాళ్వార్ ఇంట్లో దైవ చింతనతో పెరిగింది. చిన్నతనం నుంచే శ్రీకృష్ణ లీలలు, విష్ణుమూర్తి వైభవం వింటూ పెరిగిన ఆమె, స్వామిపై అనన్యమైన ప్రేమను పెంచుకుంది. ఆమె రచించిన ‘తిరుప్పావై’ మరియు ‘నాచ్చియార్ తిరుమొళి’ నేటికీ భక్తులకు మార్గదర్శకాలు. తన తండ్రి స్వామి వారి కోసం కట్టిన పూలదండలను తాను ముందుగా ధరించి, అద్దంలో తన అందాన్ని చూసుకుని “నేను స్వామికి తగిన […] - [రాజశ్యామల నవరాత్రులు: పూజా విధానం, మంత్రాలు & ప్రయోజనాలు](https://sblbhakthi.in/raja-shyamala-navaratri/): మాఘ మాసంలో వచ్చే రాజశ్యామల నవరాత్రులు ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి. వీటిని “గుప్త నవరాత్రులు” లేదా “శిశిర్ నవరాత్రులు” అని కూడా పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగ జ్ఞానం, ఆకర్షణ మరియు అంతర్గత శక్తిని కోరుకునే సాధకులకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. ఈ బ్లాగ్ పోస్ట్‌లో, రాజశ్యామల దేవి ఎవరు, ఈ నవరాత్రులను ఎలా ఆచరించాలి, మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. రాజశ్యామల దేవి ఎవరు? ప్రాముఖ్యత ఏమిటి? రాజశ్యామల దేవి జ్ఞానం మరియు ఆకర్షణ శక్తులను ప్రసాదించే దేవత. లలితా సహస్రనామంలో ఆమె లలితా దేవి చుట్టూ ఉన్న నలుగురు దేవతలలో ఒకరైన “మంత్రిణి దేవి”గా వర్ణించబడింది. రాజశ్యామల దేవిని “సాత్విక రాజసిక” గుణాలతో కూడుకున్నదిగా భావిస్తారు. అంటే, ఆమె సాత్వికతతో కూడిన రాజసిక శక్తులను ప్రదర్శిస్తుంది, ఇది జ్ఞానాన్ని మరియు ప్రపంచ ఆకర్షణను రెండింటినీ సమతుల్యం చేస్తుంది. […] - [దేవి నవరాత్రులు: నవదుర్గల ఆరాధన విధానం!](https://sblbhakthi.in/devi-navaratrulu/): దేవి నవరాత్రులు అంటే కేవలం ఉత్సవాలు కాదు, అవి ఆదిపరాశక్తిని ఆరాధించి, ఆమె అనుగ్రహం పొందడానికి లభించిన అద్భుతమైన అవకాశం. దుర్గమ్మ తొమ్మిది రూపాల్లో మనకు దర్శనమిచ్చే ఈ తొమ్మిది రోజులు, ఆధ్యాత్మిక ఉన్నతికి, కోరికల సిద్ధికీ ఎంతో విశిష్టమైనవి. తెలుగు రాష్ట్రాల్లో నవదుర్గ ఆరాధన అంతగా ప్రచారంలో లేకపోయినా, ఈ సాధనలు అత్యంత శక్తివంతమైనవని, సులభంగా సిద్ధిస్తాయని మన పురాణాలు, గ్రంథాలు చెబుతున్నాయి. ఈ బ్లాగులో, నవరాత్రులలో నవదుర్గల ఆరాధన పద్ధతులు, వాటి ప్రాముఖ్యత, ప్రయోజనాలు మరియు నైవేద్యాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. నవదుర్గల ఆరాధన ఎందుకు ముఖ్యం? నవదుర్గలు తొమ్మిది శక్తివంతమైన దేవతా స్వరూపాలు. ఈ దేవతలను ఆరాధించడం ద్వారా మానవులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా, మనసులోని భయాలు తొలగిపోతాయి, సానుకూల శక్తి పెరుగుతుంది, మరియు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది. ప్రతీ దుర్గామాత స్వరూపం ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తుంది. అందుకే, నవరాత్రులలో […] - [వారాహి నవరాత్రుల ప్రాముఖ్యత: పూజా విధానం, ప్రయోజనాలు & నియమాలు](https://sblbhakthi.in/varahi-navaratri/): ప్రస్తుత కలియుగంలో మనుషులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు – కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, న్యాయపరమైన చిక్కులు, ఆర్థిక ఇబ్బందులు, శత్రువుల బాధలు… ఈ అన్నిటికీ ఒక అద్భుతమైన పరిష్కారం దొరికితే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? మీ కోసమే వారాహి దేవి ఆరాధన! ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, ఈ సమస్యలన్నింటికీ ఓ మహత్తరమైన మార్గం. ఈ తొమ్మిది రోజులు వారాహి దేవి అనుగ్రహం ఉధృతంగా ఉంటుంది. ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తారు. వారాహి దేవి ఎవరు? ఆమె ప్రాముఖ్యత ఏంటి? వారాహి దేవిని లలితా దేవి యొక్క మరొక రూపంగా, ఆమె యొక్క శక్తి అంశంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం, లలితా దేవి తన “నేను” అనే అహంకారం నుండి వారాహి దేవిని వ్యక్తపరిచారు. భండాసురుడిని సంహరించడానికి లలితా దేవి తన సైన్యానికి వారాహి దేవిని ప్రధాన సర్వ సైన్యాధిపతి […] - [చాతుర్మాస్య దీక్ష సులభంగా పాటించే విధానం - పూర్తి వివరాలు!](https://sblbhakthi.in/chaturmasya-deeksha/): శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర కాలం చాతుర్మాస్యం. ఈ నాలుగు నెలల కాలాన్ని ఆధ్యాత్మికంగా మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి/ శయన ఏకాదశి) నుండి కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) వరకు ఉండే ఈ సమయం, కేవలం పూజలు, వ్రతాలకు మాత్రమే పరిమితం కాదు, మనసును శుద్ధి చేసుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది అనువైన సమయం. ఈ పవిత్ర కాలంలో చాతుర్మాస్యాన్ని ఎలా ఆచరించాలో ఈ బ్లాగ్ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం. చాతుర్మాస్యం ప్రాముఖ్యత “విశ్వం విష్ణుః” అన్నట్లుగా, సమస్త విశ్వంలో నిండి ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ కాలంలో తనలో తాను లీనమై ఉంటాడని ప్రతీతి. ఇది బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖంగా మారడానికి, మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికి లేదా కొనసాగించడానికి ఒక గొప్ప అవకాశం. ఈ వ్రతం పాటించడం ద్వారా ధర్మార్థకామాలతో […] - [తొలి ఏకాదశి విశిష్టత - చాతుర్మాస్య ప్రాముఖ్యత - గోపద్మ వ్రతం](https://sblbhakthi.in/toli-ekadasi/): ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని ‘తొలిఏకాదశి’ గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట!ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే పండుగలలో తొలి ఏకాదశి ఒకటి. మన సనాతన ధర్మం లో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడే ఈ రోజు, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఎందుకు ప్రాముఖ్యత? హిందూ పంచాంగం ప్రకారం, ఆషాఢ శుద్ధ ఏకాదశిని **’తొలి ఏకాదశి’**గా జరుపుకుంటారు. ఏడాది పొడుగునా వచ్చే 24 ఏకాదశులలో ఇది మొదటిది, అత్యంత ముఖ్యమైనది. ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా దశమి, ఏకాదశి తిథుల కోసం ప్రజలు ఎదురుచూడటం మన సంప్రదాయంలో ఒక భాగం. తొలి ఏకాదశి నుంచే అనేక వ్రతాలు, నియమాలు ప్రారంభమవుతాయి.ఈ రోజును ‘శయన ఏకాదశి‘ అని కూడా పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం శ్రీమహావిష్ణువు ఈ రోజు నుండి యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆషాఢ […] - [కాలభైరవాష్టకం ఎప్పుడు చదవాలి? ఫలశ్రుతి ఏమిటి?](https://sblbhakthi.in/kalabhira-ashtakam-telugu/): భారతీయ ఆధ్యాత్మిక సంపదలో భక్తులను ఆకర్షించే అనేక శక్తివంతమైన స్తోత్రాలు కొలువై ఉన్నాయి. వాటిలో, భయాలను పారద్రోలి, ధైర్యాన్ని ప్రసాదించే అద్భుతమైన స్తోత్రం కాలభైరవాష్టకం. శివుని యొక్క ఉగ్రరూపమైన కాలభైరవునికి అంకితం చేయబడిన ఈ స్తోత్రం యొక్క ప్రాముఖ్యతను, మహిమను ఈరోజు మనం తెలుసుకుందాం. అంతేకాదు, ఈ పవిత్రమైన అష్టకం యొక్క పూర్తి పాఠాన్ని కూడా మీకోసం అందిస్తున్నాను కాలభైరవుడు ఎవరు? కాలభైరవుడు శివుని యొక్క రుద్ర అంశ. ఆయన కాలానికి అధిపతి. కాలం అంటే కేవలం సమయం మాత్రమే కాదు, మృత్యువు కూడా. అందుకే కాలభైరవుడు మృత్యువును కూడా జయించే శక్తిని కలిగి ఉంటాడని నమ్ముతారు. ఆయన ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ, తన భక్తులను అన్ని ఆపదల నుండి కాపాడే కరుణామయుడు. కాలభైరవుని వాహనం శునకం (కుక్క). ఆయన చేతిలో త్రిశూలం, ఖడ్గం వంటి ఆయుధాలు ఉంటాయి. కాలభైరవాష్టకం యొక్క ప్రాముఖ్యత కాలభైరవాష్టకం ఎనిమిది శ్లోకాలతో కూడిన ఒక శక్తివంతమైన స్తోత్రం. […] - [నిత్య పూజా విధానం](https://sblbhakthi.in/nitya-pooja-vidhanam/): నిత్య పూజా విధానం లో మనం భగవంతుని ఆరాధన చేసే సమయంలో కేవలం ఉపచారాలు కాకుండా, మనసు, శరీరం, ఆత్మ మూడింటినీ పూజలో మిళితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పూజా విధానంలోనూ మనస్సు నిష్కల్మషంగా ఉండాలి. ఒకవేళ మీరు 16 ఉపచారాలతో పూజ చేస్తుంటే, వాటిని యాంత్రికంగా చేసేందుకు కాకుండా, భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని భావించి, ఆధ్యాత్మికంగా నిర్వహించడం ముఖ్యమైంది. నిత్యం పూజ చేసే విధానం ప్రతి రోజు పూజ చేయాలంటే ఎంతో సమయం అవసరం లేదు. రోజుకు కేవలం 15 – 20 నిమిషాలు మాత్రమే తీసుకొని, పూర్తి శ్రద్ధతో పూజ చేస్తే మీ మనస్సు కూడా శాంతియుతంగా ఉంటుంది.  పూజ సమయంలో మనసు మరియు శరీరం పూజలో శరీరంతో పాటు మనసు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు ధ్యానం చేసేటప్పుడు, శరీరాన్ని నిర్భయంగా నిలిపి, మనసు కూడా భగవంతుని రూపంలో లయ చెందాలి. దాన్ని అంగీకరించడం, పూజా […] - [కోనసీమ అయోధ్య: గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామాలయం](https://sblbhakthi.in/gollala-mamidada-ramalayam/): “కోనసీమ అయోధ్య”గా గొల్లల మామిడాడ గ్రామం, శ్రీ రామచంద్రమూర్తి ఆలయం ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయం తన అద్భుతమైన శిల్పకళ, విశాలమైన ప్రాంగణం మరియు ప్రశాంత వాతావరణంతో భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఆలయ చరిత్ర: ఈ ఆలయం 1889లో ద్వారంపూడి సుబ్బి రెడ్డి మరియు ద్వారంపూడి రామిరెడ్డి అనే దాతలచే ప్రతిష్టించబడింది. ఆలయ నిర్మాణం 1958లో పూర్తయింది. ఈ ఆలయం తూర్పు మరియు పశ్చిమ గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది. తూర్పు గోపురం 160 అడుగుల ఎత్తులో ఉంటే, పశ్చిమ గోపురం 200 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గోపురాలపై రామాయణం మరియు మహాభారతం నుండి తీసుకున్న అనేక అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయంలోని ప్రత్యేకతలు: ప్రధాన దేవతలు: శ్రీ రామచంద్రమూర్తి, సీతామాత, లక్ష్మణుడు, హనుమాన్ తులసి పూజ: ప్రతిరోజూ శ్రీ రామచంద్రమూర్తికి తులసి పూజ జరుగుతుంది. కుంకుమ పూజ: సీతామాతకు ప్రతిరోజూ కుంకుమ పూజ నిర్వహిస్తారు. హనుమాన్ ఉపాలయం: స్వామి […] - [ద్రాక్షారామ భీమేశ్వరాలయం | చరిత్ర | వసతి సౌకర్యాలు](https://sblbhakthi.in/draksharamam-temple/): ద్రాక్షారామ భీమేశ్వరాలయం,  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం. సాక్షాత్తు ఆ పార్వతీ దేవి వ్యాస మహర్షితో చెప్పినట్లు ఇలా చెప్పిందట “అంబ పార్వతి నాతోడ ఆనతిచ్చె,కాశి యెక్కుడు క్షేత్ర సంఘముల లోనకాశి కన్నను యెక్కుడు గౌరవమున, భోగ మోక్ష నివాసంబు దక్షవాటి!”  దక్షారామం భోగం, మోక్షం కలిగించే పవిత్రమైన స్థలం. దక్షణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు. దక్షారామం యొక్క చరిత్ర పౌరాణిక కథనాల ప్రకారం, దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసినందున ఈ ప్రదేశానికి దక్షారామం అని పేరు వచ్చింది. దక్ష ప్రజాపతి యొక్క యాగశాల ఇక్కడే ఉందని భావిస్తారు.దక్షారామం యొక్క చరిత్ర చరిత్ర గురించి పూజ్య గురువులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన ప్రవచనని ఈ వీడియో లింక్ లో వినండి దేవాలయ గురించి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి: […] - [మురమళ్ళ వీరేశ్వర స్వామి](https://sblbhakthi.in/muramalla-kalyanam/): మురమళ్ళ క్షేత్రాన్ని, మంచి జీవిత భాగస్వామితో పెళ్లి కావలి అని కోరుకునే ప్రతీ ఒక్కరు తప్పక వెళ్లి దర్శించుకోవాలి. ఈ క్షేత్రము ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరికి దగ్గరలోని కోనసీమ జిల్లాలో ఉంది.  శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని ఎవరు దర్శించి, ఇక్కడ స్వామి వారికి కళ్యాణం చేయిస్తారో వారికి సంవత్సరం తిరిగీ లోపల తప్పక కళ్యాణం అవుతుంది అని చెపుతారు. ఈ క్షేత్రమ్ లోని స్వామి వారి వైభవం, ఆలయ చరిత్ర తెలుసుకుందాం. అలాగే పెళ్లికావాలి అని కోరుకునే వారు ఇక్కడ కళ్యాణం టికెట్స్ ఎప్పుడు, ఎలా బుక్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. వీటితో పాటు మురమళ్ళ ఎలా వెళ్లాలి అక్కడి వసతి సదుపాయాల గురించి కూడా తెలుసుకుందాం. మురమళ్ళ దేవాలయం చరిత్ర ఈ క్షేత్రము అసలు పేరు మునిమండలి. ఒకప్పుడు మహర్షుల సమూహంతో నిండి వున్న ప్రాంతం ఇది. ఈ మునిమండలికి దగ్గరలోనే వున్నా ద్రాక్షారామ […] - [టీటీడీ శ్రవణం: మూగ, చెవిటి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాట!](https://sblbhakthi.in/tirumala-tirupati-sravanam/): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేవలం ఆధ్యాత్మిక సేవల్లోనే కాకుండా, సామాజిక సంక్షేమంలోనూ తన ఉదారతను చాటుకుంటోంది. అటువంటి గొప్ప కార్యక్రమాలలో ఒకటి శ్రవణం. ఈ కార్యక్రమం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని వినికిడి, మాట లోపం ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించి, వారిని సాధారణ పిల్లల్లా వినేలా, మాట్లాడేలా తీర్చిదిద్దుతూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. శ్రవణం: ఒక ఆశాకిరణం గతంలో వినికిడి లోపం లేదా మాటలు రాని పిల్లలకు సరైన వైద్య సేవలు అందుబాటులో ఉండేవి కావు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పటికీ వినలేరు, మాట్లాడలేరు అని నిరాశ పడేవారు. కానీ ఇప్పుడు టీటీడీ శ్రవణం, అటువంటి చిన్నారులకు ఒక గొప్ప వరంలా, అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చికిత్సతో పాటు, ప్రత్యేక శిక్షణ ద్వారా ఈ చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. శ్రవణం పనితీరు: ఎలా […] - [శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం](https://sblbhakthi.in/sri-maddi-anjaneya-swamy-temple/): హనుమ యొక్క విగ్రహం లేని ఊరు ఉండదు. మనకు చిన్న కష్టం వచ్చినా హనుమ యొక్క గుడికి వెళ్ళి, హనుమాన్ ప్రదక్షిణ మంత్రం చదువుకుంటూ 3, 5, 7, 9, 16, 21 మరియు 108  సార్లు ప్రదక్షిణాలు చేస్తే చాలు.  ఎటువంటి పనైనా సులభంగా అవుతుందిలే అని కొండత ధైర్యం వస్తుంది.   హనుమ ఒక భక్తుని కోసం మద్ది చెట్టు తొర్రలో స్వయంభుగా వెలసిన  పుణ్యక్షేత్రం, శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, గురవాయి గూడెంలో ఉన్న ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయ చరిత్ర రావణాసురుడు సైన్యం లో మధ్యుడు అనే రాక్షసుడు ఉండేవాడు.  హనుమ సీతాన్వేషణ కొరకు లంకకు వెళ్ళినప్పుడు, ఈ మధ్యుడు స్వామి హనుమకు భక్తుడు కావడం జరుగుతుంది. మధ్యుడు రావణ సైన్యమునకు చెందిన వాడు కావడం చేత, […] - [కూర్మగ్రామం](https://sblbhakthi.in/kurma-gramam/): మన భారత దేశం లో, కొన్ని వందల సంవత్సరాల క్రితం మరుగున పడినది , మన పూర్వీకుల భక్తిమయ మైన జీవన విధానం. మల్లి మనకు, మన భావితరాలకు ఈ భక్తిమయ మైన జీవన విధానం పరిచయం చేయడానికి ఏర్పడిన గ్రామ మే ఈ కూర్మగ్రామము. కూర్మగ్రామం, ఇక్కడి జీవన విధానానికి ఏమిటంత ప్రత్యేకత అనుకుంటున్నారా? అయితే భగవత్ గీత లో శ్రీకృష్ణ పరమాత్మా చెప్పినటువంటి చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః | తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ || నాలుగు వర్ణముల వారు శ్రీకృష్ణ పరమాత్మా నుండే వచ్చాయ ని, వారు వారు చేసే వృత్తుల ను బట్టే వారి కులములు ఏర్పడ్డాయి అని అర్ధం. శ్రీకృష్ణుడు ఈ శ్లోకములో చెప్పిన విధంగానే, ఇక్కడి వర్ణ ఆశ్రమ జీవన విధానం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారి పూర్వ ఆశ్రమ కులముల తో పని ఉండదు. ఇక్కడికి వచ్చాక […] - [శ్రీముఖలింగం ఆలయ చరిత్ర మరియు విశేషాలు](https://sblbhakthi.in/sri-mukhalingam-temple/): ఆ పరమేశ్వరుడే ఎన్నో వేలసంవత్సరాల క్రితం స్వయంభువుగా ముఖలింగ ఆకారంతో వెలసిన ఏకైక క్షేత్రం శ్రీముఖలింగం. ఈ క్షేత్రాన్ని దక్షణ కాశీ అనికూడా అంటారు. వంశధార నదీతీరాన పచ్చని ప్రకృతి నడుమ శోభిస్తున్న ఆ పరమేశ్వరుడిని ఇక్కడ శ్రీముఖలింగేశ్వరునిగా భక్తులు పూజిస్తారు. కాశ్యన్తు మరణం ముక్తిహి, శ్రీశైల శిఖరం |ముఖలింగ ముఖం దృష్ట్వ, పునర్జన్మ నవిద్యతే || అంటే కాశీలో మరణించిన, శ్రీశైలంలో శిఖర దర్శనం చేసిన, శ్రీముఖలింగేశ్వర స్వామి వారి ముఖముని దర్శనం చేసిన పునర్జన్మ ఉండదు అని మహర్షులు సైతం సేవించిన శ్రీముఖలింగేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర, ఆలయ విశేషాలతో పాటు, ఆలయానికి ఎలా వెళ్ళాలి అక్కడి వసతి సదుపాయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీ ముఖలింగేశ్వర ఆలయ చరిత్ర ద్వాపర యుగంలో వామదేవ మహాఋషి వంశధార నది వడ్డున ఒక యాగము చేయాలి అని భావించి, ఆ యాగమునకు దేవతలతో పాటుగా యక్ష, గంధర్వ, […] - [శ్రీకూర్మం ఆలయం](https://sblbhakthi.in/srikurmam-temple/): శ్రీ మహావిష్ణువు దశావతారాలలో రెండవ అవతారము శ్రీకూర్మ అవతారం. కూర్మ అవతారం లో స్వామిమికి ప్రపంచంలోనే ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. ఇక్కడ స్వామి వారిని దర్శించు కున్నవారికి శని గ్రహ దోషా లు, కుజ గ్రహ దోషాల తో పాటుగా, రాహు కేతు గ్రహ దోషాలు కూడా తొలుగుతాయి. ఇక్కడ వున్నశ్వేత పుష్కరిణి లో పితృకార్యం చేస్తే, వారికి మోక్షము కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ క్షేత్రం లో మన్ని ఆశ్చర్య పరచే ఎన్నో ప్రత్యేకత లు వున్నా యి. 108 దివ్య దేశాల లో ఒకటైన ఈ క్షేత్రం లో, స్వామి కూర్మనాధుకునిగా, ఆ శ్రీమహాలక్ష్మి కూర్మనాయకి గా వెలిశారు. శ్రీ కూర్మనాధుని కథ దేవతలు, రాక్షసులు, అమృతం కోసం పాల సముద్రంలో మందర పర్వతాన్ని చిలకభోగా, ఆ పర్వతం, పాలసముద్రం మధ్య లో పడిపోయింది. దానితో దేవతలు విష్ణు మూర్తిని ప్రార్ధించారు. ఆయన కూర్మరూపం లో […] - [సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి: ఒక దివ్య క్షేత్ర చరిత్ర!](https://sblbhakthi.in/simhadri-appanna/): మన తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాలలో సింహాచలం ఒకటి. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువైయున్నారు. ఈ బ్లాగ్ పోస్ట్‌లో, మనం స్వామివారి ఆలయ చరిత్ర, విశేషాలతో పాటుగా ఏ విధంగా అక్కడికి చేరుకోవాలి మరియు వసతి సౌకర్యాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. సింహాచలం ఆలయ ఆవిర్భావం – ప్రహ్లాదుడి కథ హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా, ప్రహ్లాదుడిని సముద్రంలో పడవేసి, బయటికి రాకుండా ఒక పర్వతాన్ని అతనిపై వేయమని ఆదేశించాడు. ఒక పెద్ద పర్వతాన్ని ప్రహ్లాదుడి మీద వేయబోగా, శ్రీమహావిష్ణువు వెంటనే ప్రత్యక్షమై, ఆ పర్వతాన్ని తన కోపంతో ఊదగా, ఆ పర్వతం కొన్ని మైళ్ళ దూరంలో పడింది. ప్రహ్లాదుడిని కాపాడిన అనంతరం, స్వామి ఈ పర్వతం మీద తాను శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా కొలువై ఉంటానని చెప్పి స్వయంభువుగా ఆవిర్భవించారు. […] - [గంగా పుష్కరాలు](https://sblbhakthi.in/ganga-pushkaralu/): గంగా పుష్కరాలు 2023 గంగా పుష్కరాలు 2023 లో 22 ఏప్రిల్ నుండి 3 మే వరకు జరగనున్నాయి. గంగా పుష్కరాలు 12 రోజులు జరుగుతాయి. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి గంగా పుష్కరాలు వస్తాయి. బృహస్పతి అశ్విని నక్షత్రం మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. గంగాపుష్కర ప్రాంతాలు గంగాదేవి హిమాలయాల్లో ఉన్న గంగోత్రి వద్ద మొదలై కలకత్తాలోని గంగా సాగర్ వద్ద ఉన్న బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగ ప్రవహిస్తున్న ప్రాంతాలలో ఎన్నో విశేషమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. గంగాదేవి పుట్టిన స్థలమైనటువంటి గంగోత్రి మొదలుకొని ఆవిడ ప్రవహించిన అనేక తీరాల యందు పుణ్యక్షేత్రములు ఏర్పడ్డాయి. వీటిలో ప్రధానంగా చెప్పబడినవి ఇవి; గంగోత్రి దేవప్రయాగ హరిద్వార్ రిషికేష్ వారణాసి ప్రయాగ్ రాజ్ గంగా సాగర్ ఈ పుణ్యక్షేత్రాలన్నింటిలోనూ అత్యంత శక్తివంతమైనది వారణాసి అనగా కాశి. వీటితో పాటు మనకి మరికొన్ని గంగా పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. అవి ఏమిటంటే అలహాబాద్. […] - [శ్రీ రామ జననం](https://sblbhakthi.in/sri-rama-jananam/): రామాయణం లోని శ్రీ రామ జననం అయినటువంటి శ్రీ రామావతారం ఎప్పుడు పారాయణ చేయాలి? శ్రీ రామనవమి వంటి మహా పర్వదినము నాడు శ్రీ సీతారాముల ఆరాధన తరువాత వడపప్పు మరియు పానకంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి.   ఉదయం పూజ తరువాత శ్రీ రామ జననము సర్గ పారాయణ చేయాలి లేదా వినవలెను.  రోజంతా ఉపవాసము ఉండాలి, కాని యడల శరీరమునకు సరిపడినంత  సాత్వికమైన ఆహారము మాత్రమే తీసుకోవాలి.  శ్రీ రామనవమి సాయంకాలం ప్రదోషవేళ శ్రీరామ పట్టాభిషేకము సర్గ ఖచ్చితంగా పారాయణ చేయవలెను లేదా వినవలెను.  శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం చేయడం మాత్రమే కాకుండా మకుట ధారణ సర్గను కూడా పారాయణ చేయవలెను.  మనుష్య జాతికి అసలు గౌరవమే లేనప్పుడు, పుట్టడం అవసరం లేని పరబ్రహ్మము నరునిగా జన్మించి నడయాడి, మనుష్య జాతి యొక్క గొప్పతనము చాటి చెప్పిన అవతారం శ్రీరామావతారం. శ్రీ రామ […] - [శ్రీరామ పట్టాభిషేకము](https://sblbhakthi.in/sri-rama-pattabhishekamu/): శ్రీ రామ పట్టాభిషేకము ఎప్పుడు పారాయణ చేయాలి? శ్రీ రామనవమి వంటి మహా పర్వదినము నాడు శ్రీ సీతారాముల ఆరాధన తరువాత వడపప్పు మరియు పానకంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి.   ఉదయం పూజ తరువాత శ్రీ రామ జననము సర్గ పారాయణ చేయాలి లేదా వినవలెను.  రోజంతా ఉపవాసము ఉండాలి, కాని యడల శరీరమునకు సరిపడినంత  సాత్వికమైన ఆహారము మాత్రమే తీసుకోవాలి. శ్రీ రామనవమి నాడు సాయంకాలం ప్రదోషవేళ శ్రీరామ పట్టాభిషేకము సర్గ ఖచ్చితంగా పారాయణ చేయవలెను లేదా వినవలెను. శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం చేయడం మాత్రమే కాకుండా మకుట ధారణ సర్గను కూడా పారాయణ చేయవలెను. శ్రీరామ పట్టాభిషేక ఘట్టము (యుద్ధకాండ 131వ సర్గ – 59వ శ్లోకముతో ప్రారంభం) తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైస్సహ! రామం రత్నమయే పీఠే సహసీతం న్యవేశయత్!! వసిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః! కాత్యాయనస్సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా!! […] - [శ్రీ రామనవమి](https://sblbhakthi.in/sri-rama-navami/): హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో శ్రీరామ నవమి ఒకటి. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ధర్మానికి, సత్యానికి, ఆదర్శాలకు ప్రతీకయైన శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే ఒక మహోన్నత వేడుక.  చైత్ర శుద్ధ నవమి నాడు, వసంత ఋతువులో, పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. ఈ శుభ దినం కోట్లాది భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, భక్తి పారవశ్యాన్ని కలిగిస్తుంది. శ్రీరామ నవమి పూజా విధానం: భక్తితో స్వామిని ఆరాధించే వేళ! శ్రీరామ నవమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, నిత్యకర్మలు, స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా, మామిడి ఆకుల తోరణాలతో ఇంటి గుమ్మాలను అలంకరించడం సంప్రదాయం. గుమ్మాలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. పూజ సామాగ్రిని ముందుగానే సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. శ్రీ సీతారాముల పటమును లేదా చిన్న విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేయాలి. పూజలో […] - [ఉగాది పండుగ](https://sblbhakthi.in/ugadi-panduga/): ఉగాది పండుగ నే యుగాది అని కూడా అంటారు. అంటే యుగము ఆరంభమైన రోజు అని అర్థం. కలియుగం ఈ రోజే ప్రారంభం అయినటువంటి కారణం చేత ఉగాది లేక యుగాది అన్న పేరు వచ్చాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాదు ఉగ అంటే నక్షత్ర గమనము, ఆది అనగా ప్రారంభము. ఉగాదికే నక్షత్ర గమనం ప్రారంభమైన రోజు అని కూడా అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటాం. ఉగాది పండుగ తెలుగు సంవత్సరంలోని మొదటి పండుగ. ఈరోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది 2025 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం అనగా తేది : 30.03.2025 న ఉదయం గం. 6.15 ని.లు నుండి గం. 11.15 ని.లు వరకు నూతన పంచాంగ శ్రవణం, ఇష్ట దైవ దర్శనం, పండితులు ఆశీస్సులు పొందుటకు, […] - [పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి?](https://sblbhakthi.in/puttina-roju-ela-jarupukovali/): ఈ రోజున ఏ ఏ పనులు చేయాలి? పుట్టిన రోజు ఎలా జరుపుకోవాలి అనేది, మనకు శాస్త్రం ఒక విధిని నిర్ణయం చేసింది.  మన సంస్కృతి, సంప్రదాయాలలో తప్పకుండా గుర్తుపెట్టుకుని చేసుకోవాలసినది జన్మదినం ఒకటి. నేను నా పుట్టినరోజును జరుపుకోను అని అనకూడదు. ఖచ్చితంగా జరుపుకుని తీరాలి! పుట్టిన రోజును ఎలా పడితే అలా జరుపుకోకూడదు.  ఆ రోజున తెల్లవారు జాము నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి.  అంటే ఒంటికి నూనే వ్రాసుకుంటే అలక్ష్మి తొలగిపోతుంది.  కాబట్టి ఒంటినిండా నూనె వ్రాసుకుని తల స్నానం చేయాలి. తల స్నానం చేసే ముందు పెద్దవాళ్ళు తల పైన నూనెపెట్టి ఆశీర్వచనం చేస్తారు.   స్నానం ముగించుకున్న తరువాత కుల దైవాన్ని మరియు ఇష్ట దైవాన్ని ఆరాధన చేయాలి. తదుపరి ఆవు పాలలో బెల్లం ముక్క, నల్ల నువ్వులు ఈ మూడు బాగా కలపాలి.  ఈ కలిపిన మిశ్రమాన్ని తూర్పు వైపుకి తిరిగి కొద్దిగా […] - [శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం](https://sblbhakthi.in/shiva-ashtottara-satanama-stotram/): ఏదైనా ధర్మ బద్దమైన కోరిక సిద్దించాలి అంటే! దీనిని స్కాందపురాణం లో శ్రీమన్నారాయణుడు పార్వతీ దేవికి ఉపదేశం చేస్తూ ఇలా అంటారు.   అమ్మా పార్వతీ శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటి అష్టోత్తరం.  ఇందులోని ఈ 108 నామాలు ఎంతో పరమ పవిత్రమైన నామాలు.  ఈ నామాలుకు ఉన్న గొప్పతనమేమిటో తెలుసా! ఇవి తమంత తానుగా విన్నంత మాత్రం చేత చదివినంత మాత్రం చేత విశేషమైన ఫలితాన్నిస్తాయి. అన్నిటికన్నా గొప్పతనమేమిటంటే ఏదైనా ధర్మ బద్దమైన కోరిక సిద్దించాలి అంటే!  ఆ కోరిక వలన మీరు అభివృద్ది లోనికి వస్తారు, లేదంటే ప్రమాదం అని అనుకుంటేనే! పెద్దలు చెప్పే మాట ఏమిటంటే ఒక్కసారి ఈ శివ అష్టోత్తర శతనామావళి చదివి మీరు అనుకున్న కార్యనికి బయలు దేరితే ఖచ్చితంగా నెరవేరుతుంది అని అంటారు. శ్రీ శివాష్టోత్తర శతనామావళి ధ్యానమ్ ధవళ వపుష మిందోర్మండలేసన్నివిష్ఠంభుజగవలయహారం, భస్మదిగ్ధాంగమీశం | మృగయపరశుపాణిం, చారుచంద్రార్ధ మౌళింహృదయకమలమధ్యే, సంతతం […] - [హనుమాన్ ప్రదక్షిణ మంత్రం](https://sblbhakthi.in/hanuman-pradakshina-mantram-telugu/): హనుమ గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పవలసిన హనుమాన్ ప్రదక్షిణ మంత్రము స్వామి హనుమ ప్రధానంగా ప్రదక్షిణముల వలన తొందరగా ప్రీతి పొందుతారని శ్రీ పరాశర సంహిత లో చెప్పబడినది.  మనం ప్రదక్షణ ఎలా చేయాలి, వాటి నియమాలు ఏమిటో మన పురాణములలో చెప్పినవి అన్నీ, హనుమద్ వైభవం రూపంలో శ్రీ పరాశర సంహిత లో చెప్పబడినది.  హనుమాన్ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడకూడదు.  నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడుస్తూ, ప్రదక్షిణ చేయాలి. గబ గబా నడవటం, గెంతులు వేస్తూ పరుగులు తీయటం చేయరాదు. హనుమాన్ ప్రదక్షిణ మంత్రం చెబుతూ స్వామి వారి గుడి చుట్టూ  ప్రదక్షిణాలు చేస్తే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా  కలుగుతుంది,  అని శ్రీ పరాశర సంహితలో చెప్పబడినది. హనుమాన్ ప్రదక్షిణ మంత్రము ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం |తరునార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహమ్ || ఈ శ్లోకం చదువుకుంటూ 108, 21, 16, 9, […] - [శివ దండకం - శ్రీకంఠ లోకేశ](https://sblbhakthi.in/siva-dandakam/): శివ దండకమును అర్జునుడు ఎప్పుడు చేశారంటే?  శివ దండకం వెనుక చాలా విశేషమైన కధ జరిగినది. ఒకానొకప్పుడు వ్యాసభగవానుడు పాండవులతో ఇలా చెబుతాడు పాండవులారా మీరు యుద్దంలో కౌరవులపై గెలవాలంటే శివానుగ్రహం తప్పకుండా ఉండాలి!  కనుక అర్జునుడుని ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేయడానికి పంపించండి. అక్కడ పరమ శివుడ్నిఆరాధన, తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రంను వరంగా అడగాలి. శంకరుడు దానిని ఇచ్చి ఆశీర్వదిస్తే ఇక మీ విజయమునకు తిరుగుండదు అని చెప్తాడు. అర్జునుడు తపస్సు కొరకై బయలు దేరుట. అర్జునుడు తన అన్న, తమ్ముళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి ఇంద్రకీలాద్రి చేరుకుని కొన్ని సంవత్సరముల శివ ఆరాధన మరియు తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుని యొక్క తండ్రి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి యెందుకు ఇంత తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలి అని అడుగుతాడు. శంకరుని అనుగ్రహం మరియు నాకు పాశుపతాస్త్రం కావాలి అంటాడు […] - [భీష్మ తర్పణం ఎలా వదలాలి?](https://sblbhakthi.in/bhishma-tarparnam/): భీష్మాష్టమి ఎప్పుడు వస్తుంది? ప్రతి సంవత్సరం రథ సప్తమి మరుసటి రోజున భీష్మ అష్టమి అనుసరించవలసి ఉంటుంది.  ఈ రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది.  దీనినే భీష్మ తర్పణం అని కూడా అంటారు.  అయితే ఈ సంవత్సరం రథ సప్తమి మరియు భీష్మ అష్టమి ఒకే రోజు రావటం గమనార్హం. అయితే అష్టమి తిధి మాత్రం జనవరి 28 శనివారం రోజున సమయం ఉ. 08.43 గం నుండి ప్రారంభమై జనవరి 29 ఆదివారం సమయం ఉ. 09.45 గం వరకు ఉంటుంది. 2023 వ సంవత్సరం జనవరి 28 శనివారం రోజున సమయం ఉ. 11.30 గం నుండి మ. 01.39 గం వరకు భీష్మ తర్పణం ఇవ్వటానికి అనువైన సమయం. భీష్మ తర్పణం ఎందుకు ఇవ్వాలి? భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించినాడు, చిట్ట చివర శ్రీకృష్ణుని […] - [మహాశివరాత్రి ఉపవాసం మరియు జాగరణ](https://sblbhakthi.in/maha-shiva-ratri/): మహా శివరాత్రి శివుడికి సంబంధించిన పండుగలన్నింటిలోనూ చాలా  ప్రధానమైనది . మహా శివరాత్రి రోజునే అరుణాచలం లో అగ్నిలింగం ఏర్పడింది అని అంటారు. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అని అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మాత్రం మహాశివరాత్రి అని అంటారు.  మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ మరియు శివార్చన చేస్తారు. ఇలా చేస్తే పునర్జన్మంటూ ఉండదని శాస్త్ర వాక్కు. మహాశివరాత్రి శివార్చన శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి. స్నానము సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. తదుపరి ఇంటి లో శివునికి షోడశోపచారాలతో పూజ చేయాలి. శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టుట శ్రేష్టము. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవలెను. అర్ధరాత్రి 12గంటలకు లింగోధ్బవ సమయమున శివునికి అభిషేకం చేయటం చాల శ్రేష్టము. మహాశివరాత్రి ఉపవాసం మహాశివరాత్రి ఉపవాసం ఆచరించాలి. ఉపవాస దీక్షలో ప్రధానముగా చేయవలసినది శివుని పూజ, శివనామ […] - [Sri Govinda Namalu - శ్రీ గోవింద నామాలు](https://sblbhakthi.in/sri-govinda-namalu/): Sri Govinda Saranagati Mala – SBL Bhakthi శ్రీనివాసా గోవిందా |  శ్రీ వేంకటేశా గోవిందా || శ్రీనివాసా గోవిందా |  శ్రీ వేంకటేశా గోవిందా || భక్తవత్సలా గోవిందా |  భాగవతప్రియ గోవిందా || గోవిందా హరి గోవిందా |  గోకులనందన గోవిందా || నిత్యనిర్మలా గోవిందా |  నీలమేఘశ్యామ గోవిందా || గోవిందా హరి గోవిందా |  గోకులనందన గోవిందా || పురాణపురుషా గోవిందా |  పుండరీకాక్ష గోవిందా || గోవిందా హరి గోవిందా |  గోకులనందన గోవిందా || నందనందనా గోవిందా |  నవనీతచోర గోవిందా || గోవిందా హరి గోవిందా |  గోకులనందన గోవిందా || పశుపాలక శ్రీ గోవిందా |  పాపవిమోచన గోవిందా || గోవిందా హరి గోవిందా |  గోకులనందన గోవిందా || దుష్టసంహార గోవిందా |  దురితనివారణ గోవిందా || గోవిందా హరి గోవిందా |  గోకులనందన గోవిందా || […] - [సౌందర్యలహరి](https://sblbhakthi.in/soundarya-lahari/): సౌందర్యలహరి స్తోత్రాన్ని జగత్ గురువు అయినటువంటి ఆదిశంకరాచార్య రచించారు. జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్య ఎన్నో అద్భుతమైన స్తోత్రాలని మనకందించారు. శివానందలహరి,  సౌందర్యలహరి, కనకధార స్తోత్రం,  సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం,  భజ గోవిందము, అన్నపూర్ణాష్టకము   మరియు ఎన్నో అద్భుతమైన రచనలను మనకందించారు. శంకరాచార్య రచనలలో అగ్రగణ్య మైనది సౌందర్యలహరి. బాహ్యమునందున సౌందర్యలహరి అనగా “సౌందర్య” అంటే అందం, “లహరి” అంటే కెరటము. ఇక్కడ సౌందర్యం అంటే అర్థము బాహ్యసౌందర్యం కాదు  అంతః సౌందర్యం  ఆత్మజ్ఞానము. సౌందర్యలహరి రెండు కారణముల చేత ఎంతో శక్తివంతమనిపెద్దలు చెబుతారు. మొదటిది సౌందర్యలహరి స్తోత్రాల అర్థమే అమ్మవారు. ఇందులో అమ్మవారిని పాదముల నుంచి కేశములు వరకూ వర్ణన చేస్తారు. రెండవ కారణం శ్రీవిద్య మంత్రశాస్త్ర రహస్యమంతా ఇందులోనే నిక్షిప్తమై ఉంది. సౌందర్యలహరి ఎలా వచ్చింది? ఆదిశంకరాచార్య కైలాసములో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి వెళ్లారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు శంకరాచార్యులకు 5 ఆత్మ లింగాలను ప్రసాదించారు. 5 ఆత్మ […] - [వినాయక చవితి పత్రి పూజ](https://sblbhakthi.in/vinayaka-chavithi-patri-in-telugu/): వినాయక చవితి పత్రి పూజ  21  రకాల ఆకులతో చేస్తారు. గణేష్ చతుర్థి నాడు వినాయక వ్రత కథ మరియు వినాయకుని పత్రి పూజ ఎంతో ప్రాముఖ్యమైనవి. గజరాజు అయినటువంటి వినాయకుడు, ఏనుగు ముఖాన్ని కలిగి ఉంటారు.  ఏనుగులకు సహజంగా ఆకులు పండ్లు అంటే ఎంతో ప్రీతి. అందుకే వినాయక చవితి రోజున మనం గజముఖము  కలిగిన స్వామిని అనేకమైన ఆకులతో మరియు పండ్లతో పూజిస్తాము.  అంతేకాదు పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి అని  భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ అంటారు.  దాని అర్థం ఏమిటంటే భక్తితో ఈశ్వరుడికి ఒక ఆకు కానీ, పువ్వులు కానీ, పండ్లు కానీ  ఏది సమర్పించినా భగవంతుడు ఎంతో ప్రీతి చెందుతాడు. కాబట్టి భక్తిగా మనం వినాయకునికి ఏకవింశతి పత్రి  పూజలో ఆకులతో ప్రార్థించాలి. మనలో చాలామంది వినాయక చవితి పత్రి పూజ మంత్రములకు సంబంధం లేకుండా  పత్రిని  వినాయకునికి సమర్పిస్తారు. దీనికి కారణము మంత్ర భాగానికి […] - [వినాయక వ్రత కథ](https://sblbhakthi.in/vinayaka-vratha-katha/): వినాయక వ్రత కథ ను వినాయక చవితి రోజు తప్పకుండా చదవాలి. భాద్రపద శుక్లపక్ష చవితిని మనము వినాయక చవితిగా జరుపుకుంటాము. ఈ రోజున వినాయక వ్రత కథ చదివి అక్షంతలు తల పైన చల్లుకుంటే ఆరోజు చంద్రుని చూసినాకూడా అపనిందలు రావు. మనము వినాయకుని చవితి రోజున శమంతకోపాఖ్యానము తప్పకుండా చదవాలి. అలాగే ఈ వినాయక వ్రత కథలో చెప్పిన “సింహః ప్రసేన మవదీత్” శ్లోకాల్ని అందరూ చెప్పాలి. వినాయక వ్రత కథ – శమంతకోపాఖ్యానము యదువంశంలో సత్రాజిత్తు, ప్రసేనుడు అనే సోదరులు ఉండేవారు. వారు నిజ్ఞుని కుమారులు. సత్రాజిత్తు సూర్యభగవానుడి కై ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యారు. అంతట సూర్యభగవానుడిని శమంతకమణి తనకి ఇవ్వమని సత్రాజిత్తు కోరెను. సూర్యనారాయణ మూర్తి ఆయన మెడలోని శమంతకమణి తీసి సత్రాజిత్తు కిచ్చెను. ఆమణిని గురించి ఇలా చెప్పెను. ఈ దివ్యమణి పవిత్రులై ధరించవలెను. అప్పుడు ఈ మనీ రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్ని […] - [గర్భరక్షాంబికా దేవి](https://sblbhakthi.in/garbha-rakshambika-devi/): గర్భరక్షాంబికా దేవి ఎవరు గర్భరక్షాంబికా దేవి, సాక్షాత్ ఆ జగన్మాత అయినటువంటి పార్వతీదేవి. భక్తుల గర్భములో ఉన్న దోషాలను తొలగించి, వారికి సంతానాన్ని కలిగించే తల్లి. సంతానం లేక బాధపడుతున్నవారు, గర్భవతులు, పిల్లల తల్లులు ఈవిడని పూజిస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన, సంతానానికి సంబంధించిన సమస్యలు తొలగుతాయి అని పెద్దలు చెబుతారు. గర్భ రక్షాంబికా దేవి ఆలయం గర్భ రక్షాంబికా దేవాలయం తిరుకరుకావుర్ అనే ఊర్లో ఉంది. తిరుకరుకావుర్, తమిళనాడు రాష్ట్రంలోని, తంజావూరు జిల్లాలోని, పాపనాశనం తాలూకాలో ఉంది. తంజావూరు లేదా కుంభకోణం నుండి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలి అనుకునేవాళ్ళు ముందుగా తంజావూరు లేదా కుంభకోణం చేరుకోవాలి. అక్కడి నుండి మనకి అనేకమైన బస్సులు సదుపాయం కలదు. గర్భరక్షాంబికా అమ్మవారి పూజా విధానం సంతాన సమస్యలు ఉన్నవారు: సంతాన సమస్య ఉన్న దంపతులు ఈ గుడి లో 11 […] - [చాగంటి గారి సుందరకాండ ప్రవచనం](https://sblbhakthi.in/chaganti-sundarakanda/): చాగంటి గారు సుందరాకాండ ప్రవచనాన్ని ఐదు రోజుల పాటు ఎంతో అద్భుతంగా ప్రసంగించారు. రామాయణం లో ఏడు కొండలు ఉన్నాయి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ మరియు ఉత్తరకాండ. ఈ కాండం అన్నింటిలోనూ సుందరకాండ ఎంతో ప్రాముఖ్యత చెందినది. సుందరాకాండ పారాయణానికి ఎంతో యోగ్యమైన కాండగా పెద్దలు చెప్తారు. శ్లో!! సుందరకాండ వైశిష్ట్యము గురించి ఒక మాట చెబుతారు;సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథ |సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనమ్ ||సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః |సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరమ్ ? చాగంటి గారు సుందరకాండ గురించి ఐదు రోజుల పాటు అద్భుతంగా ప్రవచించారు. సుందరాకాండని వినిన, చదివిన ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు.  సుందరకాండ పారాయణ విధానం  గురించి తెలుసుకోవాలి అనుకుంటే  ఈ లింక్ ని క్లిక్ చేయండి ఈ కింద ఉన్న […] - [సుందరకాండ పారాయణ విధానం](https://sblbhakthi.in/sundarakanda-parayana-vidhanam/): రామాయణంలోని ఏడుకాండలల్లో సుందరకాండ మహోత్కృష్టమైనది. ఎటువంటి ఆపద నైనా, ఎటువంటి ధార్మిక కోరికలైనా తీర్చగలిగే అద్భుతమైన కాండ సుందరకాండ.  ఎన్నో మంత్ర సాధన రహస్యాలని, మహర్షి శ్లోక రూపంలో నిక్షిప్తం చేశారు. అటువంటి అద్భుతమైన సుందరాకాండ కావ్యాన్ని ఎలా పారాయణ చేయాలి?, ఎక్కడ పారాయణ చెయ్యాలి? ఎప్పుడు పారాయణ చేయాలి? అన్న విషయాలను మనం తెలుసుకుందాం. సుందరకాండను ఎలా పారాయణ చేయాలి సుందరకాండని ఎలా పారాయణ చెయ్యాలో తెలుసుకుందాం. నిత్య సుందరకాండ పారాయణ చేసే వారు, లేదా ఏ కోరిక లేకుండా సుందరకాండ పారాయణ చేసే వారు ఆ స్వామి మీద భక్తిశ్రద్ధలతో సాధారణ పారాయణ చేయవచ్చు. కానీ ఏదైనా కోర్కెతో కనుక సుందరకాండను పారాయణ చేసేటట్లయితే మనం తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. సాత్విక ఆహారము తినాలి, నేలపై చాప వేసుకొని పడుకోవాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, నిత్యం రామ స్మరణలో గడపాలి. సుందరకాండలోని 68 సర్గలు పారాయణ చేసిన తరువాత యుద్ధకాండ […] - [రాఖీ పౌర్ణమి](https://sblbhakthi.in/rakhi-pournami/): రాఖీ పౌర్ణమి శ్లోకం రాఖీ పౌర్ణమిని, శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రాఖీ అనగా రక్షణ బంధం అని అర్థం వస్తుంది. రాఖీ పండుగ రోజు సోదరి ముందుగా తన తమ్ముడు లేదా అన్న వద్దకు చేరుకొని, తన సోదరుడు అభివృద్దిలోకి రావాలని దేవుడిని ప్రార్ధన చేసి, బొట్టు పెట్టి, అక్షతలు వేసి, ఆశీర్వదించి సోదరుని చేతికి రాఖీ కట్టే టప్పుడు. “యేన భద్దో బలీ రాజా దానవేంద్రో మహాబలఃతేన త్వమభి బద్నామీ రక్ష మాచల మాచల” అనే రాఖీ శ్లోకాన్ని చదువుతూ ఆప్యాయంగా రాఖీ కడతారు. దీనికి బదులుగా సోదరుడు జీవితంలో ఎల్లవేళలా కష్టసుఖాలలో అండగా ఉంటానని ఆశీర్వదిస్తారు. తరువాత ఎంతో సంతోషంగా సోదరులకు హారతి ఇస్తారు. ఎప్పుడు కలకాలం సంతోషంగా ఉండాలని ఒకరికి ఒకరు స్వీట్స్ తినిపించు కుంటారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉత్సాహంగా రాఖీ జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి కథ రక్షాబంధనం జరుపుకోవడానికి […] - [గరుడ పంచమి - గరుత్మంతుని చరిత్ర](https://sblbhakthi.in/garuda-panchami/): గరుడ పంచమి గరుడ పంచమి ప్రతియేటా శ్రావణ మాసంలో పంచమి తిథి నాడు వస్తుంది. ఈ రోజే నాగపంచమిగా కూడా జరుపుకుంటారు. ఈనాడు గరుత్మంతుని వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం కూడా ఉంది. ఈ వ్రతాన్ని సత్సంతానాన్ని పొందడానికి చేస్తారు. అలాగే సంతానం కలిగిన స్త్రీలు వారి పిల్లల ఆరోగ్య అభివృద్ధి కొరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. గరుత్మంతుని పంచమి రోజున తప్పకుండా సుపర్ణోపాఖ్యానం ( గరుత్మంతుని చరిత్ర ) చదవాలని పెద్దలు చెబుతారు. దీనివలన సత్సంతానము, సంతానాభివృద్ధి కలుగుతుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కింద ఉన్న వీడియోలో ఎంతో అద్భుతంగా సుపర్ణోపాఖ్యానం ప్రవచించారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ గరుత్మంతుని చరిత్రను విని ఆ గరుడుడిని ఆశీస్సులు ఆ శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు మీకు కలగాలని మేము ఆకాంక్షిస్తున్నము. ఈరోజు శ్రీమహావిష్ణువుని కూడా ఎంతో విశేషంగా ఆరాధిస్తారు. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం కనుక ఆయన […] - [శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం](https://sblbhakthi.in/sri-vallabha-karavalamba-stotram/): శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం శ్రీ వల్లభ గణపతి కి సంబంధించిన అద్భుతమైన శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం స్తోత్రం ఇది. దీన్ని నిరంతరం పఠించినట్లయితే అభీష్ట సిద్ధులు లభిస్తాయి. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఈ స్తోత్రం హఠ యోగా శాస్త్రాన్ని అనుసరించి రచించినట్లు గా తెలుస్తున్నది. ఇటువంటి దివ్యమైన స్తోత్రం అందరూ పట్టించి తరించవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతేశ్రీ మహాగణపతే పాహి పాహి మాంశ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతేశ్రీ మహాగణపతే రక్ష రక్ష మాం ఓమంఘ్రిపద్మమకరందకులామృతం తేనిత్యం యజంతి దివి యత్ సురసిద్ధసంఘాః |జ్ఞాత్వామృతం చ గణశస్తదహం భజామిశ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 1 || శ్రీమాతృసూనుమధునా శరణం ప్రపద్యేదారిద్ర్యదుఃఖశమనం కురు మే గణేశ |మత్సంకటం చ సకలం హర విఘ్నరాజశ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ || 2 || గంగాధరాత్మజ వినాయక మూలమూర్తేవ్యాధిం జవేన వినివారయ ఫాలచంద్ర |విజ్ఞానదృష్టిమనిశం […] - [గర్భరక్షాంబికా స్తోత్రం](https://sblbhakthi.in/garbha-rakshambika-stotram/): గర్భరక్షాంబికా స్తోత్రం ఎంతో శక్తివంతమైనది. గర్భవతులు కావాలనుకునే స్త్రీలు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే గర్భం ధరిస్తారని శాస్త్రవాక్కు.  అలాగే గర్భవతిగా ఉన్న స్త్రీలు ఈ గర్భరక్షాంబికా స్తోత్రాన్ని చదివితే వారికి వారి కడుపులో ఉన్న బిడ్డ కి ఆరోగ్యం  చేకూరుతుంది.  కాదు వారికి సుఖప్రసవం కూడా అవుతుంది.  పిల్లల తల్లులు ఎవరైనా ఈ గర్భరక్షాంబికా స్తోత్రాన్ని పారాయణం చేస్తే వారి  పిల్లలు అనారోగ్యం నుండి బయట పడతారని పెద్దలు చెబుతారు. గర్భరక్షాంబికా దేవి ఆలయం గురించి పూజా విధానం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేయండి గర్భరక్షాంబికా స్తోత్రం శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ || వాపీతటే వామభాగే, వామదేవస్య దేవస్య దేవి స్థితా త్వమ్ |మాన్యా వరేణ్యా వదాన్యా, పాహి గర్భస్థజంతూన్ తథా భక్తలోకాన్ || 1 || శ్రీగర్భరక్షాపురే యా, దివ్యసౌందర్యయుక్తా సుమాంగళ్యగాత్రీ |ధాత్రీ జనిత్రీ జనానాం, దివ్యరూపాం దయార్ద్రాం […] - [వరలక్ష్మీ వ్రత కథ](https://sblbhakthi.in/varalakshmi-vratha-katha/): వరలక్ష్మీ వ్రతం… ఈ పేరు వినగానే మహిళల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. సిరిసంపదలు, సౌభాగ్యాలను ప్రసాదించే ఈ పవిత్రమైన వ్రతం శ్రావణ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతం సంపూర్ణం కావాలంటే వరలక్ష్మీ వ్రత కథను చదవాలి లేదా వినాలి. మనకు ఈ వ్రత కథలోనే  వరలక్ష్మీ వ్రత విధానం, వ్రత కల్పం గురించిన విశేషాలన్నీ మహర్షులు వివరించారు. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతానికి, కింద ఉన్న వరలక్ష్మీ వ్రత కథను చదివి మీరు, మీ కుటుంబ సభ్యులు ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నాము. వరలక్ష్మీ వ్రత కథ సూతమహాముని శౌనకాది మహర్షులను చూసి ఇలా చెప్పారు: “మహర్షులారా, స్త్రీలకు సకల సౌభాగ్యములు, సిరిసంపదలు ఇచ్చే ఒక వ్రతాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పారు. ఆ వ్రతం గురించి మీకు వివరిస్తాను వినండి.” పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన వరలక్ష్మీ వ్రత మహత్యం సూతమహాముని శౌనకాది మహర్షులను చూసి […] - [ఖైరతాబాద్ గణేశ్ 2025](https://sblbhakthi.in/khairatabad-ganesh-2023/): ఖైరతాబాద్ గణేశ్ 2025 (khairatabad ganesh 2025) 1954 సం.. లో ఒక్క అడుగు విగ్రహంతో, ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ ప్రస్తానం ప్రతియేటా ఒక్కొక్క అడుగు పెరుగుతూ ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. ఈ సంవత్సరం గణపతి విగ్రహం తయారీ పనులను కర్ర పూజ తో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని మహాగణపతిని పర్యావరణ హితంగా (eco-friendly ganesh) ను మట్టితో తయారు చేస్తున్నారు.  వినాయక చవితి 2025 న స్వామివారు శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి గా దర్శనమిస్తారు.   ఖైరతాబాద్ గణేశ్ రూపాన్ని ప్రతీ యేట ఒక్కొక్క రూపంగా మారుస్తూ వుంటారు, ఈ సారి 2025  ఇయర్ లో థీమ్ ను శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి 69 అడుగుల (sri viswasanthi maha shakthi ganapathi 69 feet) ఎత్తులో కొలువై మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మహా గణపతికి […] - [జంధ్యాల పౌర్ణమి](https://sblbhakthi.in/jandhyala-pournami/): జంధ్యాల పౌర్ణమి         శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని, రక్షాబంధన్ అని, ఉపాకర్మ ప్రారంభ రోజు అని  అనేక విశేషాలు ఉన్నాయి.  ప్రతీ ఏటా ఈ రోజున యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. యజ్ఞోపవీతం మంటే జంధ్యం, ఇది ధరించినవారికి యజ్ఞం చేయటానికి అధికారమును పొంది ఉన్నాడు అని గుర్తు.  ఎవరికైతే జంధ్యం  ధరించే నియమం ఉంటుందో  వారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి.  యజ్ఞోపవీతాన్ని ధరించిన వారు ప్రతినిత్యం సంధ్యావందనం మరియు యజ్ఞం చేయటానికి అధికారమును పొంది ఉంటారు. యజ్ఞం చేయడం వలన దేవతలు ప్రీతి పొందుతారు, దేవతలు చాలా ప్రీతి చెందారు అంటే సకాలంలో వర్షాలు పడతాయి, వర్షాలు సకాలంలో పడటం వలన పంటలు బాగా పండి లోకం సస్యశ్యామలం గా ఉండి అందరూ సంతోషంగా ఉంటారు.           యజ్ఞం చేయటానికి అధికారం  దేని వలన […] - [మంగళ గౌరి వ్రతం](https://sblbhakthi.in/mangala-gowri-vratham/): మంగళ గౌరి వ్రతం మంగళ గౌరీ వ్రతమును, ప్రతి ఏటా కూడా శ్రావణ మాసం లో వచ్చేటటువంటి మంగళవారములు లలో సువాసినిలు చేసి సర్వమంగళ దేవతని ఉపాసన చేస్తారు. అమ్మవారుని కలశలోకి ఆవాహన చేసి పూజిస్తారు అదవా గౌరీ దేవి ప్రతిమ తో పూజిస్తారు. ఆ రోజు అమ్మవారి నామాలతో అమ్మవారికి పూజ చేసి ఆవిడ కి నైవేద్యం పెట్టి వ్రతకల్పం లో ఏ కధ అయితే చెప్పబడిందో ఆ కథను భక్తి శ్రద్దలతో విని తల మీద అక్షతలను ధరిస్తారు. సర్వమంగళ దేవత ఉపాసన చేస్తే సువసినిలు భర్త యొక్క జీవితాన్ని కాపాడుకుంటారు. శ్రావణ మంగళ గౌరీ దేవి వ్రతమును శ్రీకృష్ణుడు ద్రౌపది దేవికి, నారద మునీంద్రుడు సావిత్రి దేవికి ఉపదేశించారు. పెళ్లి అయ్యాక ఐదు సంవత్సరములు ఈ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేసుకున్నవారికి వైధవ్యం రాదు అని శాస్త్రవాక్కు. మంగళ గౌరీ దేవి వ్రత మును వారి వారి పరంపరాగతంగా […] - [గరుడ గమన తవ స్తోత్రం](https://sblbhakthi.in/garuda-gamana-tava/): గరుడ గమన తవ  స్తోత్రము ఎంతో శక్తివంతమైన శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రము.  దీనిని  శృంగేరి పీఠాధిపతులైనా శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు భారతీ తీర్థ స్వామి వారు రచించారు.  ఈ స్తోత్రము నందు శ్రీమహావిష్ణువుని ఎంతో  అద్భుతముగా కీర్తించారు. గరుత్మంతుని అధిరోహించిన ఆ శ్రీమహావిష్ణువుని వర్ణన  చేస్తారు. గరుడ గమన తవ స్తోత్రమును విన్నప్పుడు మనసుకి ఎంతో శాంతిని ఇస్తుంది.  శ్రీ భారతీ తీర్థ స్వామి వారు ఎంతో  లలితముగా ఈ స్తోత్ర రచనను చేశారు. ఎవరైనా సులభముగా ఆ శ్రీమహావిష్ణువుని కీర్తించడానికి వీలుగా ఉంటుంది.  గరుడ గమన తవ గరుడ గమన తవ చరణకమలమిహమనసిల సతు మమ నిత్యంమనసిల సతు మమ నిత్యం !! మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవ !! 1. జలజనయన విధినముచిహరణముఖ విబుధవినుత-పదపద్మ – 2 మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవ 2.భుజగశయన భవ మదనజనక మమజననమరణ-భయహారీ – 2 మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవ 3.శంఖచక్రధర దుష్టదైత్యహరసర్వలోక-శరణ – 2 మమతాపమపాకురుదేవమమపాపమపాకురుదేవ 4.అగణిత గుణగణ అశరణశరణదవిదళిత-సురరిపుజాల- […] - [సుందర హనుమాన్ మంత్రం](https://sblbhakthi.in/sundara-hanuman-mantra/): సుందర హనుమాన్ మంత్ర వైభవము సుందర హనుమాన్ మంత్రమును స్వయంగా బ్రహ్మదేవుడే దిగివచ్చి హనుమంతుని కీర్తిస్తూ చెప్పారు. ఈ సుందర ఆంజనేయ మంత్రములో బ్రహ్మ గారు 32 నామాలతో హనుమను స్తుతి చేస్తారు ఇందులో ఐదు నామాలు రహస్య నామాలు, మిగతా 27 నామాలని సుందర హనుమాన్ మంత్రము గా పిలుస్తారు. ఈ 32 నామాలతో స్వామి హనుమ లో ఉన్న మంత్ర మూర్తిని బ్రహ్మ గారు స్తుతి చేస్తారు సుందర హనుమాన్ మంత్రం​ హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహాబలఃకపీంద్రహ పింగళాక్షశ్ఛ లంకా ద్వీప భయంకరఃప్రభంజన సుతః వీరః సీతాశోక వినాశకః అక్షహంతా రామ సఖః రామ కార్య దురంధరామహౌషధ గిరేర్హరి వానర ప్రాణ దాయకఃవాగీశ తారకశ్ఛయివ మైనాక గిరిభంజనఃనిరంజనో జితక్రోధః కదళీవన సంవృతః ఊర్ధ్వ రేతా మహా సత్వః సర్వ మంత్ర ప్రవర్తకఃమహాలింగ ప్రతిష్టాత బాష్పకృత్ జపతాం వరఃశివధ్యానపరో నిత్యం శివపూజ పరాయణః || సుందర హనుమాన్ మంత్ర […] - [శ్రీ క్రిష్ణాష్టమి - శ్రీ కృష్ణ జననం](https://sblbhakthi.in/sri-krishna-ashtami/): శ్రీ క్రిష్ణాష్టమి  శ్రీకృష్ణ భగవానుడు  జన్మించిన రోజునే మనం శ్రీకృష్ణాష్టమి గా జరుపుకుంటాము.  శ్రీకృష్ణాష్టమి రోజున స్వామికి పాలు, వెన్న, అటుకులు  వంటివి ప్రసాదాలుగా పెట్టి  శ్రీ కృష్ణాష్టకం మరియు శ్రీ కృష్ణ జననం చదవాలి.  శ్రీ కృష్ణ జననం ఆ శ్రీమహావిష్ణువే శ్రీకృష్ణునిగా అవతార స్వీకారం చేశారు. దుర్మార్గుడు అయినటువంటి తన మేనమామ అయిన కంసుని చంపటం కొరకు మరియు మరెందరో రాక్షసులను చంపి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా అవతారాన్ని స్వీకరించారు. శ్రీ కృష్ణ పరమాత్మ శ్రావణ మాసం కృష్ణపక్షంలో  వచ్చే అష్టమి తిథి నాడు అర్ధరాత్రి 12 గంటలకు జన్మించారు.  దేవకీ వసుదేవులు శ్రీ కృష్ణునికి కారాగారంలోనే జన్మనిచ్చారు. దేవకి వసుదేవులకు అష్టమ గర్భమున శ్రీకృష్ణుడు జన్మించారు.  జలధరదేహు నాజాను చతుర్భుహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాను  కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత […] - [వరలక్ష్మి వ్రత విధానం](https://sblbhakthi.in/varalakshmi-vratha-vidhanam/): శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, ప్రతి ఇంటా సందడే సందడి. ముఖ్యంగా మహిళలు ఎంతో ఆతృతగా ఎదురుచూసే పండుగ వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రతం ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని ప్రగాఢ నమ్మకం. మరి ఈ పవిత్రమైన వరలక్ష్మీ వ్రతాన్ని ఎప్పుడు, ఎలా ఆచరించాలి? దాని ప్రాముఖ్యత ఏమిటి? తెలుసుకుందాం. వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకుంటారు? సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఒకవేళ ఆ రోజు వీలు కాని వారు, శ్రావణ మాసంలోని మిగిలిన శుక్రవారాలలో ఏదో ఒక శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ముఖ్యంగా సువాసినులు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేసుకుంటారు. వరలక్ష్మి వ్రత విధానం వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి అనే విషయాన్ని సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించారు. ఆ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం: ఉదయం నుంచే శుచిగా సిద్ధం అవ్వండి వరలక్ష్మీ వ్రతం రోజు […] - [రుక్మిణీ కళ్యాణం](https://sblbhakthi.in/rukmini-kalyanam/): రుక్మిణీ కళ్యాణం  భాగవతం దశమస్కంధం లో వ్యాస మహర్షిచే చెప్పబడినది దీనినే పోతనగారు తెలుగులోనికి అనువదించారు.  పెళ్లి కాని ఆడపిల్లలు లేదా మగవారు రుక్మిణీ కళ్యాణ ఘట్టం లోని శ్లోకాలని, రుక్మిణీ కళ్యాణ ఘట్ట చరితమును విని ఈ శ్లోకాలు విన్నా, పారాయణము చేసినా శ్రీఘ్రముగా వివాహం అవుతుందని, భార్య భర్తల మధ్య అనురాగం పెరుగుతుందని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, మోక్షమును అనుగ్రహిస్తుందని ఫలశ్రుతి.  రుక్మిణి కళ్యాణం ప్రవచనం రుక్మిణీ కల్యాణాన్ని పెళ్లి కాని ఆడ వారు కానీ లేదా మగవారు కానీ పారాయణ చేయడం వల్ల యోగ్యుడైన  భర్త లేదా భార్య  లభిస్తారు. రుక్మిణీ కల్యాణం గురించి చాగంటి గారు చాలా అద్భుతంగా ప్రసంగించారు.  వారి ప్రవచనం ని ఈ కింది వీడియోలో వినండి. రుక్మిణి కల్యాణ పారాయణ ఎలా చేయాలి రుక్మిణీ కళ్యాణం ఎవరు పారాయణ చేయాలి, ఎలా పారాయణ చేయాలి, ఎన్ని రోజులు పారాయణ చేయాలి ఇలా అన్నింటికీ సంబంధించి […] - [వినాయక చవితి కధ](https://sblbhakthi.in/vinayaka-chavithi-kadha/): వినాయక చవితి వ్రత కధ  వినాయక చవితి నాడు చదవ వలసిన కధ అంటే శమంతకోపాఖ్యానం ఒకటే, శ్రీకృష్ణుడు కి విఘ్నేశ్వరుడికి మధ్య సంభందంతో కూడి ఉన్న శమంతకోపాఖ్యానం పరాశర మహర్షి చేత రచించబడినటువంటి విష్ణు పురాణం, వ్యాసుని చేత రచించబడినటువంటి స్కంద పురాణం శమంతకోపాఖ్యానం కి ఆధారాలు. వినాయక చవితి రోజున కింద ఉన్న శ్లోకాన్ని తప్పకుండా చదవాలని పెద్దలు చెబుతారు సింహః ప్రసేన మవదీత్, సింహో జాంబవంతాహతః,సుకుమారక మారోధి,స్తవహ్యేశ స్యమంతకః వినాయక చవితి రోజు చదవాల్సిన వ్రత కథ చాగంటి గారు ఈ కింద ఉన్న వీడియోలో చెప్పారు. వినాయక చవితి రోజున ఈ వ్రత కథను వినిన మీకు మీ కుటుంబ సభ్యులు ఆ విగ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది . వినాయక చవితి వ్రత కల్పము వినాయక చవితి వ్రత కల్పము పుస్తకము PDF ను  ఈ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి download […] - [సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం](https://sblbhakthi.in/subramanya-bhujanga-stotram/): సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర విశేషాలు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని తమిళనాడు లోని తిరుచెందూర్ గ్రామములో ఆదిశంకరాచార్య గారు రచించారు. ఈ తిరుచెందూర్ క్షేత్రం లోనే సౌర పాదుడు అనే రాక్షసుడిని కుమారస్వామి సంహరించారని పద్మ పురాణము నందు చెప్పబడియున్నది ఆదిశంకరాచార్యులు ధ్యానములో నుండి ఆ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించి ఈ స్తోత్రాన్ని రచన చేశారు. ఈ షణ్ముఖుని స్తోత్రము 33 శ్లోకాలతో ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర రూపంలో ఆది శంకరాచార్యులవారు మనకు తిరుచెందూర్ క్షేత్రం లో కొలువై ఉన్న ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఈ స్తోత్రంలో శంకరాచార్యులవారు సుబ్రహ్మణ్యస్వామి కొలువున్న తిరుచెందూర్ క్షేత్రాన్ని అక్కడి సముద్రాన్ని ఆ స్వామి మూర్తిని ఎంతో అద్భుతంగా వర్ణిస్తారు. భుజంగం అనగా సర్పము అని అర్థం వస్తుంది. తెలుగు రాష్ట్రాల యందు మరియు కన్నడ రాష్ట్రమునందు సుబ్రహ్మణ్యుని సర్ప రూపంలో ఎక్కువగా కొలుస్తూ వుంటారు. తమిళనాట సుబ్రహ్మణ్యుని మూర్తి […] - [అరుణాచల శివ నామాలు](https://sblbhakthi.in/arunachala-shiva-namalu-telugu/): అరుణాచలం లో చెప్పవలసిన శివ నామాలు అరుణాచలం క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయం లో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడుఏ నామాలతో పూజ చేయాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశారు  ఆ నామలన్నిటిని గౌతమ మహర్షి కి చెప్పి గౌతమ మహర్షి చేత సంకరణం చేయించారు పరమేశ్వరుడు. ఎవరు అరుణాచలం వచ్చి ఈ నామములు అరుణాచల క్షేత్రం లో పలుకుతరో ఎవరు ఈ నామములతో శివలింగానికి పూజ చేసుకుంటారో అటువంటి వారి అందరికీ కూడా పరమేశ్వరుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది.  అరుణాచల శివ నామాలు (1) శ్రోణాద్రీశుడు (2) అరుణాద్రీశుడు (3) దేవాధీశుడు (4) జనప్రియుడు (5) ప్రసన్న రక్షకుడు (6) ధీరుడు (7) శివుడు (8) సేవకవర్ధకుడు (9) అక్షిప్రేయామృతేశానుడు (10) స్త్రీపుంభావప్రదాయకుడు (11) భక్త విఘ్నప్తి సంధాత (12) దీన బంధ విమోచకుడు (13) ముఖ రాంఘ్రింపతి (14) శ్రీమంతుడు (15) మృడుడు (16) ఆషుతోషుడు (17) మృగమదేశ్వరుడు (18) […] - [శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం](https://sblbhakthi.in/vinayaka-shodasa-namalu-telugu/): విగ్నేశ్వర షోడశ నామ స్తోత్రములో స్వామి గణపతిని 16 నామములతో పూజిస్తాము. ప్రతిరోజూ పూజ ప్రారంభం లో ఈ పదహారు నామములు  చెప్పి పూజ ప్రారంభించాలి. విగ్నేశ్వర షోడశ నామ స్తోత్రము లో ఆ గణపతి యొక్క  గుణగణములు, వైభవమును వివరించబడినది. ప్రతిరోజు ఎవరైతే ఈ 16 నామమునే చెప్తారు లేదా వింటారో వారికి విద్యలోనూ వివాహం లోనూ మరి ఏ ఇతర కార్యం లోనూ విఘ్నములు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు  చూసుకుంటారని ఫలస్తుతి. శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 || ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 || షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 || https://youtu.be/hGiT-1pnD_o ఉద్యోగ ప్రాప్తి కొరకు శ్రీ వల్లభ గణపతి […] - [కంచి కామాక్షి దేవాలయం దర్శనం](https://sblbhakthi.in/kanchi-kamakshi-devalayam-darsanam/): కంచి కామాక్షి దేవాలయం దర్శనం అయోద్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికా, పురి ద్వారకవతి శైవ సప్తైతతే మోక్షదాయక భారతదేశాన్ని అంతటినీ ఒక ఆద్యాత్మిక కేంద్రంగా ఉపాసన చేసినటువంటి ఋషిలు ఈ 7 నగరాలను మోక్షపురాలుగా నిర్ణయం చేశారు.మోక్షపురాలు 7 లో ఆరు ఉత్తర భారతదేశం లో ఉంటే ఒక్క కాంచిపురం ధక్షిణ భారతదేశం లో ఉంది ఆ కాంచిపురం లో కామాక్షి పరదేవత స్వరూపం, లోకంలో వున్న అందరికీ కూడా కొంగు బంగారం అయింది.ఆవిడ పేరు కామాక్షి ఐన కారణం చేత, తన కన్నుల చేత అందరి కోరికలు తీర్చిన కల్పవల్లి గా భాసించింది.ఈ దేవాలయంలో కామాక్షి అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగాముద్రలో పద్మాసనం పై ఆసీనురాలై దర్శనం ఇస్తున్నారు ప్రతి దేవాలయంలో అమ్మవారి విగ్రహం స్వామివారి విగ్రహం ఒక దగ్గర ఉండి భక్తులకు దర్శనం ఇస్తారు.కానీ ఈ దేవాలయం లో కామాక్షి అమ్మవారు భక్తులకు దర్శనం […] ## Pages - [About us](https://sblbhakthi.in/about-us/): SBL Bhakthi is a Devotional blog that has been started to guide people who are interested in knowing about Sanatana Hindu Dharama. The website is started by Mr. Satyanarayana Pydi in the year 2022. At SBL Bhakthi blog, we are dedicated to providing a sacred space where devotees of Hinduism can come together to explore and deepen their spiritual journey. Our aim is to offer a wealth of knowledge, insights, and inspiration related to Hinduism and its profound teachings. Our team of passionate writers and contributors are committed to sharing authentic and comprehensive information about various aspects of Hinduism, including […] - [Terms and Conditions](https://sblbhakthi.in/terms-and-conditions/): Terms and Conditions for SBL Bhakthi Last updated: March 11, 2023 Please read these terms and conditions carefully before using Our Service. Interpretation and Definitions Interpretation The words of which the initial letter is capitalized have meanings defined under the following conditions. The following definitions shall have the same meaning regardless of whether they appear in singular or in plural. Definitions For the purposes of these Terms and Conditions: Acknowledgment These are the Terms and Conditions governing the use of this Service and the agreement that operates between You and the Company. These Terms and Conditions set out the rights […] - [Privacy Policy](https://sblbhakthi.in/privacy-policy/): Privacy Policy for SBLBhakthi At SBLBhakthi, accessible from sblbhakthi.in, one of our main priorities is the privacy of our visitors. This Privacy Policy document contains types of information that is collected and recorded by SBLBhakthi and how we use it. If you have additional questions or require more information about our Privacy Policy, do not hesitate to contact us. This Privacy Policy applies only to our online activities and is valid for visitors to our website with regards to the information that they shared and/or collect in SBLBhakthi. This policy is not applicable to any information collected offline or via […] - [Contact](https://sblbhakthi.in/contact-us/) [comment]: # (Generated by Hostinger Tools Plugin)