Home » శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం
shiva ashtottara satanama stotram

ఏదైనా ధర్మ బద్దమైన కోరిక సిద్దించాలి అంటే!

దీనిని స్కాందపురాణం లో శ్రీమన్నారాయణుడు పార్వతీ దేవికి ఉపదేశం చేస్తూ ఇలా అంటారు.   అమ్మా పార్వతీ శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం చాలా విశేషమైనటువంటి అష్టోత్తరం.  ఇందులోని ఈ 108 నామాలు ఎంతో పరమ పవిత్రమైన నామాలు.  ఈ నామాలుకు ఉన్న గొప్పతనమేమిటో తెలుసా! ఇవి తమంత తానుగా విన్నంత మాత్రం చేత చదివినంత మాత్రం చేత విశేషమైన ఫలితాన్నిస్తాయి.

అన్నిటికన్నా గొప్పతనమేమిటంటే ఏదైనా ధర్మ బద్దమైన కోరిక సిద్దించాలి అంటే!  ఆ కోరిక వలన మీరు అభివృద్ది లోనికి వస్తారు, లేదంటే ప్రమాదం అని అనుకుంటేనే! పెద్దలు చెప్పే మాట ఏమిటంటే ఒక్కసారి ఈ శివ అష్టోత్తర శతనామావళి చదివి మీరు అనుకున్న కార్యనికి బయలు దేరితే ఖచ్చితంగా నెరవేరుతుంది అని అంటారు.

శ్రీ శివాష్టోత్తర శతనామావళి

ధ్యానమ్

ధవళ వపుష మిందోర్మండలేసన్నివిష్ఠం
భుజగవలయహారం, భస్మదిగ్ధాంగమీశం |

మృగయపరశుపాణిం, చారుచంద్రార్ధ మౌళిం
హృదయకమలమధ్యే, సంతతం చింతయామి ||

శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || 1 ||

శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || 2 ||

భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివప్రియః
ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః || 3 ||

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || 4 ||

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || 5 ||

సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || 6 ||

హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || 7 ||

హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || 8 ||

కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః
మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || 9 ||

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః || 10 ||

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || 11 ||

మృడః పశుపతిర్దేవో మహాదేవోవ్యయో హరిః
పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః || 12 ||

భగనేత్రభిదవ్యక్తో సహస్రాక్షస్సహస్రపాత్
అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరః || 13 ||

ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||

ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ సమాప్తం.

ఈ 108 నామాలు చదవాలి అనుకూటే ఈ క్రింది వీడియొ ను క్లిక్ చేయండి.

ఈ స్తోత్రాన్ని మహాశివరాత్రి లాంటి ముఖ్యమైన రోజుల్లో పారాయణ చేయటం వలన రెట్టింపు ఫలితాన్ని పొందగలరు. 

మీ యొక్క విలువైన సూచనలు మరియు సలహాలు ఈ క్రింది కామెంట్ రూపంలో తెలుపగలరు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page