srirama navami

హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలలో శ్రీరామ నవమి ఒకటి.  శ్రీ రాముని జన్మదినమును పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటారు.

శ్రీ రాముడు వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు.  

శ్రీ రామనవమి పండుగను ఎలా జరుపుకోవాలి?

2023 వ సంవత్సరం గురువారం, మార్చి 30 న శ్రీ రామ నవమి వచ్చినది.  ఈ రోజున తెల్లవారు జామునే నిద్ర లేచి, నిత్య మరియు స్నానాది కార్యక్రమములు ముగించుకుని,  ఇల్లంతా చక్కగా అలంకరించుకుని, ముఖ్యంగా మామిడి ఆకుల తోరణములతో ఇంటి గుమ్మాలకు అలంకరించాలి.  తదుపరి గుమ్మాలకు పసుపురాసి, కుంకుమ బొట్లు పెట్టాలి.  పూజ సామాగ్రిని ముందుగానే సమకూర్చుకోవలెను.

శ్రీ సీతారాముల పటమునకు గాని లేదా చిన్న విగ్రహాలకు గాని పూజలు చేయాలి.  వడపప్పు మరియు పానకంతో స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి.  ఉదయం రామాయణం లోని బాలకాండ నుంచి శ్రీరాముడు ఆవిర్భవించిన శ్రీరామావతర ఘట్టం సర్గను పారాయణ చేయాలి. 

తదుపరి ఉపవాసం ఉండి లేదా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుని, రామ నామాన్ని జపించడం, దగ్గర్లో ఉన్న రామాలయానికి వెళ్ళడం, రామ నామాన్ని రాయగలిగినన్ని సార్లు రాయడం వంటి పనులు చేయాలి.  

రామ నామం యొక్క గొప్పతనాన్ని చెప్తూ, పరమ శివుడు పార్వతీ దేవితో ఇలా అంటాడు.  ఓ పార్వతీ రామ నామాన్ని 3 సార్లు చెప్పి నంత మాత్రము చేత, విష్ణు సహస్ర నామాన్ని ఒకసారి పారాయణ చేసిన ఫలితం వస్తుంది! అని అంటాడు.   అది ఎలా అంటే! రా = 2 మ = 5 (2×5)*(2×5)*(2×5)  మొత్తం 1000 

ఈ క్రింది శ్లోకమును గమనించగలరు.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||

ఆ రోజు సాయంకాలం యుద్ధకాండలో  పట్టాభిషేక సర్గను పారాయణ చేయాలి. తదుపరి ఇంటికి దగ్గర్లో వున్న రామాలయాల్లో శ్రీ సీతారామ కళ్యాణం చూడటం కాని లేదా పండితులు  చెప్పినప్పుడు వినడం చేయాలి.   

శ్రీ రామనవమి రోజున కళ్యాణం చేయడం ఎంత ముఖ్యమో మకుట ధారణ సర్గను పారాయణ చేయటం కూడా అంటే ముఖ్యం.

మకుట ధారణ సర్గ

బ్రహ్మణానిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితమ్|

అభిషిక్తః పురా యేన మనుస్తం దీప్త తేజసమ్||

తస్యాన్వవాయే రాజానః క్రమాత్ యేనాభిషేచితాః|

సభాయాం హేమక్లప్తాయాం శోభితాయాం మహాధనైః||

రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః|

నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిథి||

కిరీటేన తతః పశ్చాత్ వసిష్టేన మహాత్మనా|

ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః||

శ్రీ రామనవమి వంటి నైమిత్తిక తిధి రోజున శ్రీరామావతర ఘట్టం సర్గను, పట్టాభిషేక సర్గను పారాయణ చేసిన లేదా విన్నంత మాత్రము చేత విశేషమైనటువంటి ఫలితమును పొందుతారు.

ఈ మహా పర్వదినము రోజున ప్రముఖ పుణ్య క్షేత్రమైనటువంటి భద్రాచలం లో శ్రీ సీతా రాముల కళ్యాణం ఎంతో విశేషంగా జరుగుతుంది. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *