సుందర హనుమాన్ మంత్ర వైభవము
సుందర హనుమాన్ మంత్రమును స్వయంగా బ్రహ్మదేవుడే దిగివచ్చి హనుమంతుని కీర్తిస్తూ చెప్పారు. ఈ సుందర ఆంజనేయ మంత్రములో బ్రహ్మ గారు 32 నామాలతో హనుమను స్తుతి చేస్తారు ఇందులో ఐదు నామాలు రహస్య నామాలు, మిగతా 27 నామాలని సుందర హనుమాన్ మంత్రము గా పిలుస్తారు. ఈ 32 నామాలతో స్వామి హనుమ లో ఉన్న మంత్ర మూర్తిని బ్రహ్మ గారు స్తుతి చేస్తారు
హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహాబలః
కపీంద్రహ పింగళాక్షశ్ఛ లంకా ద్వీప భయంకరః
ప్రభంజన సుతః వీరః సీతాశోక వినాశకః
అక్షహంతా రామ సఖః రామ కార్య దురంధరా
మహౌషధ గిరేర్హరి వానర ప్రాణ దాయకః
వాగీశ తారకశ్ఛయివ మైనాక గిరిభంజనః
నిరంజనో జితక్రోధః కదళీవన సంవృతః
ఊర్ధ్వ రేతా మహా సత్వః సర్వ మంత్ర ప్రవర్తకః
మహాలింగ ప్రతిష్టాత బాష్పకృత్ జపతాం వరః
శివధ్యానపరో నిత్యం శివపూజ పరాయణః ||
సుందర హనుమాన్ మంత్ర ఫలస్తుతి
ఎవరైతే సుందర హనుమాన్ మంత్రాన్ని పటిస్తారో వారికి విసూచి వ్యాధి అనారోగ్యము కలగదు అని స్వయంగా బ్రహ్మ గారి ఫలస్తుతి చెప్పారు. శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు ఈ క్రింది యూట్యూబ్ వీడియో లో ఆ నామాలను ఎలా పలకాలో, సుందర హనుమాన్ మంత్రం వైభవం ఏమిటో తెలియచేసియున్నారు.
Very very nice slokam.
Thank you 🙂
Thank you
Om namo Hanumathe namaha Jai Sri Ram Jai Hanuman
హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే
శ్రీరామ జయ రామ జయ జయ రామ
జై హనుమాన్ తెన్నేటి శర్మ