Home » వినాయక చవితి పత్రి పూజ
వినాయక చవితి పత్రి పూజ

వినాయక చవితి పత్రి పూజ  21  రకాల ఆకులతో చేస్తారు. గణేష్ చతుర్థి నాడు వినాయక వ్రత కథ మరియు వినాయకుని పత్రి పూజ ఎంతో ప్రాముఖ్యమైనవి. గజరాజు అయినటువంటి వినాయకుడు, ఏనుగు ముఖాన్ని కలిగి ఉంటారు.  ఏనుగులకు సహజంగా ఆకులు పండ్లు అంటే ఎంతో ప్రీతి. అందుకే వినాయక చవితి రోజున మనం గజముఖము  కలిగిన స్వామిని అనేకమైన ఆకులతో మరియు పండ్లతో పూజిస్తాము.  అంతేకాదు

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి

అని  భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ అంటారు.  దాని అర్థం ఏమిటంటే భక్తితో ఈశ్వరుడికి ఒక ఆకు కానీ, పువ్వులు కానీ, పండ్లు కానీ  ఏది సమర్పించినా భగవంతుడు ఎంతో ప్రీతి చెందుతాడు. కాబట్టి భక్తిగా మనం వినాయకునికి ఏకవింశతి పత్రి  పూజలో ఆకులతో ప్రార్థించాలి.

మనలో చాలామంది వినాయక చవితి పత్రి పూజ మంత్రములకు సంబంధం లేకుండా  పత్రిని  వినాయకునికి సమర్పిస్తారు. దీనికి కారణము మంత్ర భాగానికి అర్థం తెలియక పోవటం. అందుకే ఈ కింద ఏ మంత్రభాగానికి ఏ పత్రి తో  గణేషుడిని పూజించాలో వివరించాము.  కావున ఈ సంవత్సరం వినాయక చవితి రోజున మంత్ర భాగానికి అనుకూలంగా శ్రద్ధా భక్తులతో పత్రిని  విగ్నేశ్వరుని కి సమర్పిద్దాం.

వినాయకునికి ఏకవింశతి పత్రి పూజ

సుముఖాయ నమః – మాచీపత్రం పూజయామి |1| – (మాచి పత్రీ)

గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి |2| – (ములక ఆకు)

ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి |3| – (మారేడు దళము)

గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి |4| – (గరిక పూస)

హరసూనవే నమః – దత్తూరపత్రం పూజయామి |5| – (ఉమ్మెత్త ఆకు)

vinayaka chavithi patri pooja

లంబోదరాయ నమః – బదరీపత్రం పూజయామి |6| – (రేగిపండు ఆకు)

గుహాగ్రజాయ నమః – అపామార్గపత్రం పూజయామి |7| – (ఉత్తరేణి ఆకు)

గజకర్ణాయ నమః – తులసీపత్రం పూజయామి |8| – (తులసి ఆకు)

ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి |9| – (మామిడి ఆకు)

వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి |10| – (గన్నేరు ఆకు)

vinayaka pooja patri

భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి|11| – (విష్ణుకాంతం ఆకులు)

వటవే నమః – దాడిమీపత్రం పూజయామి |12| – (దానిమ్మ ఆకులు)

సర్వేశ్వరాయ నమః – దేవదారుపత్రం పూజయామి |13| – (దేవదారు ఆకులు)

ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి |14| – (మరువం ఆకులు)

హేరంబాయ నమః – సింధువారపత్రం పూజయామి |15| – (వావికి ఆకులు)

vinayaka Chaviti patri pooja

శూర్పకర్ణాయ నమః – జాజీపత్రం పూజయామి |16| – (మల్లె ఆకు)

సురాగ్రజాయ నమః – గండకీ పత్రం పూజయామి |17| – (దేవ కాంచనం)

ఇభవక్త్రాయ నమః – శమీపత్రం పూజయామి |18| – (జమ్మి ఆకు)

వినాయకాయ నమః – అశ్వత్థ పత్రం పూజయామి |19| – (రావి ఆకు)

సురసేవితాయ నమః – అర్జున పత్రం పూజయామి |20| – (తెల్ల మద్ది ఆకులు)

కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి |21| – (జిల్లేడు ఆకులు)

వరసిద్ధి వినాయకాయ ఏకవింశతి పత్రాణి పూజయామి.

వినాయక చవితి పత్రి పూజ

వినాయక చవితి పత్రి పూజలో చదవవలసిన మంత్రభాగాన్ని,  ఆ ఆకుల పేర్లన్నీ ఈ కింద ఉన్న ఈ కింద ఉన్న వీడియో చూసి తెలుసుకోండి.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page