విగ్నేశ్వర షోడశ నామ స్తోత్రములో స్వామి గణపతిని 16 నామములతో పూజిస్తాము. ప్రతిరోజూ పూజ ప్రారంభం లో ఈ పదహారు నామములు చెప్పి పూజ ప్రారంభించాలి.
విగ్నేశ్వర షోడశ నామ స్తోత్రము లో ఆ గణపతి యొక్క గుణగణములు, వైభవమును వివరించబడినది.
ప్రతిరోజు ఎవరైతే ఈ 16 నామమునే చెప్తారు లేదా వింటారో వారికి విద్యలోనూ వివాహం లోనూ మరి ఏ ఇతర కార్యం లోనూ విఘ్నములు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటారని ఫలస్తుతి.
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||
ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 ||
షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 ||
ఉద్యోగ ప్రాప్తి కొరకు శ్రీ వల్లభ గణపతి కి సంబంధించిన అద్భుతమైన స్తోత్రం శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం ఇది ఎవరైతే ప్రతీరోజు పారాయణ చేస్తారో వారికి ఉద్యోగ ప్రాప్తి మరియు అభీష్ట సిద్ధులు కలుగుతాయి. ఇది చదవడానికి ఈ లింకు ను క్లిక్ చేయండి.
1 thought on “శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రం”