Home » శ్రీ క్రిష్ణాష్టమి – శ్రీ కృష్ణ జననం
sri krishna ashtami

శ్రీ క్రిష్ణాష్టమి

 శ్రీకృష్ణ భగవానుడు  జన్మించిన రోజునే మనం శ్రీకృష్ణాష్టమి గా జరుపుకుంటాము.  శ్రీకృష్ణాష్టమి రోజున స్వామికి పాలు, వెన్న, అటుకులు  వంటివి ప్రసాదాలుగా పెట్టి  శ్రీ కృష్ణాష్టకం మరియు శ్రీ కృష్ణ జననం చదవాలి. 

ఆ శ్రీమహావిష్ణువే శ్రీకృష్ణునిగా అవతార స్వీకారం చేశారు. దుర్మార్గుడు అయినటువంటి తన మేనమామ అయిన కంసుని చంపటం కొరకు మరియు మరెందరో రాక్షసులను చంపి ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణునిగా అవతారాన్ని స్వీకరించారు. శ్రీ కృష్ణ పరమాత్మ శ్రావణ మాసం కృష్ణపక్షంలో  వచ్చే అష్టమి తిథి నాడు అర్ధరాత్రి 12 గంటలకు జన్మించారు.  దేవకీ వసుదేవులు శ్రీ కృష్ణునికి కారాగారంలోనే జన్మనిచ్చారు. దేవకి వసుదేవులకు అష్టమ గర్భమున శ్రీకృష్ణుడు జన్మించారు. 

జలధరదేహు నాజాను చతుర్భుహు

సరసీరుహాక్షు విశాలవక్షు

జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు

కంఠ కౌస్తుభమణి కాంతి భాను 

కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు

శ్రీవత్సలాంఛనాంచిత విహారు

నురుకుండల ప్రభాయుత కుంతల లలాటు

వైడూర్య మణిగణ వరకిరీటు

బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోక

పాలు సుగుణాలవాలు కృపావిశాలు

జూచి తిలకించి పులకించి చోద్యమంది

యుబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించె 

మహానుభవుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. 

నాలుగు బాహువులతో నల్లటి మబ్బు ఎలా ఉంటుందో,  అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంక చక్ర గధా పద్మములను ధరించన వాడై, మంచి వజ్ర వైడూర్యములు పొడగబడిన కిరీటంతో, మంచి నల్లటి కుంతలముతో, చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణాభరముల యొక్క కాంతి గండస్థలముల యందు ప్రకాశిస్తుండగా, మెడలో కౌస్తుభం అనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచేటటువంటి పాద పద్మములతో, చంటి పిల్లవాడిగా వాసుదేవుడు దర్శనమిచ్చాడు. 

అటువంటి పిల్లవాడిని చూసి సంకెళ్లలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు.ఆ ఆనందంలో మానసికంగా శచీల స్నానం చేసేసి, పదివేల గోవులను, పదివేల బ్రామ్మనులుకు దానం చేసేశాడు.  ఈ మొత్తం మొక్కును తాను ఖైదు నుండి విడిపోగానే తీర్చుకుంటాను అని అనుకున్నాడు.

శ్రీమన్నారాయణుడు తనకు కొడుకుగా పుట్టినందుకు ఎంతో పొంగిపోయి  నమస్కరించాడు. దేవకీ దేవి కూడా తన కడుపున పుట్టిన తన కొడుకుకి తాను నమస్కరిస్తుంది.  ఈశ్వర ఈ లోకమంతా నీయందు ఉన్నా నువ్వు మాత్రం నాకు కొడుకుగా పుట్టావు అని నీను ఏమి భాగ్యం చేసుకున్నాను అయ్యా! అని పొంగిపోయినది.  

స్వామి నన్ను కారాగారం లో పెట్టాడు నా సోదరుడు నీకు ఏమి అపాయం చేస్తాడో అని బెంగ పెట్టుకుంటున్నాను అని అంది. 

ఆ స్వామి ఆ దేవకీ, వాసుదేవులను చూస్తూ మీరు బయపడకండి!  

అసలు నీను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెబుతాను వినండి. 

స్వాయంభవు మనువు యొక్క మన్వంతరము లో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) కూడా ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య నీ పేరు సుతపుడు ఆమె పేరు పృశ్ని. 

మీ ఇద్దరు పన్నెండు వేల దివ్య సంవత్సరములు నాకొరకు తపస్సు చేశారు.  నీను ప్రత్యక్షమయ్యాను ఏమి కావాలి అని అడిగాను, మీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండిపోయింది. 

నీలాంటి కొడుకు కావాలి అన్నారు.  నాలాంటి కొడుకు నీను తప్ప ఇంకోకడు లేడు.  మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మాటు అడిగితే నీను మూడు మార్లు పుట్టాను అని శ్రీమన్నారాయణుడు చెబుతాడు. 

 

శ్రీ కృష్ణాష్టకం

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 1 ॥
అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 2 ॥
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురమ్ ॥ 3 ॥
మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 4 ॥
ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 5 ॥
రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 6 ॥
గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 7 ॥
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ॥ 8 ॥
కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥

శ్రీ కృష్ణుని జననం మరియు జన్మ రహస్యం గురించి చాగంటి గారు ఎంతో చక్కగా ఈ కింద వీడియోలో వివరించారు. ఈ కృష్ణాష్టమి రోజున శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క జననం వినడం ద్వారా ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది.


6 thoughts on “శ్రీ క్రిష్ణాష్టమి – శ్రీ కృష్ణ జననం

  1. Jai radhe radhe krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna krishna

    1. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
      హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే

  2. Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna

    1. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే
      హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page