khairatabad ganesh 2025

ఖైరతాబాద్ గణేశ్ 2025 (khairatabad ganesh 2025)

1954 సం.. లో ఒక్క అడుగు విగ్రహంతో, ప్రారంభమైన ఖైరతాబాద్ గణేశ్ ప్రస్తానం ప్రతియేటా ఒక్కొక్క అడుగు పెరుగుతూ ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది.

ఈ సంవత్సరం గణపతి విగ్రహం తయారీ పనులను కర్ర పూజ తో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని మహాగణపతిని పర్యావరణ హితంగా (eco-friendly ganesh) ను మట్టితో తయారు చేస్తున్నారు.  వినాయక చవితి 2025 న స్వామివారు శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి గా దర్శనమిస్తారు.  

ఖైరతాబాద్ గణేశ్ రూపాన్ని ప్రతీ యేట ఒక్కొక్క రూపంగా మారుస్తూ వుంటారు, ఈ సారి 2025  ఇయర్ లో థీమ్ ను శ్రీ విశ్వశాంతి మహా శక్తి గణపతి 69 అడుగుల (sri viswasanthi maha shakthi ganapathi 69 feet) ఎత్తులో కొలువై మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

మహా గణపతికి ఎడమవైపున శ్రీ శ్రీ గజ్జలమ్మ కుడివైపున శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఇంకా శ్రీ జగన్నాధ స్వామి మరియు శ్రీ లలిత త్రిపురసుందరి విగ్రహాలు దర్శనం ఇవ్వనున్నాయి. అయితే పూర్తిగా విగ్రహాలను పర్యావరణ హితంగానే తయారుచేస్తారు.

11 రోజులు పాటు పూజలు నిర్వహించి, 11 వ రోజున హుస్సేన్ సాగర్ లో నిమర్జనం (నిమజ్జనం) చేయడానికి తరలించేలా యేర్పాట్లు చేస్తున్నారు.

ఇక గడచిన గత 10 యేళ్లు పైగా మండపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ తాపేశ్వరానికి చెందిన సురుచి ఫూడ్స్ అధినేత మల్లిబాబు గారు ఖైరతాబాద్ లో జరిగే గణపతి ఉత్సవానికి మహా లడ్డును పంపిస్తున్నారు, అయితే 2021 లో మాత్రం 100 కే‌జిల లడ్డును ప్రసాదంగా పంపించారు, స్థానికంగా హైదరాబాద్ లో ఎలెక్ట్రికల్ అండ్ ఎయిర్ కూలెర్స్ వ్యాపారి 1100 కే‌జిల లడ్డును స్వామి కి సమర్పించారు మరియు భక్త ఆంజనేయ స్వీట్స్ నుండి 900 కే‌జిల లడ్డును స్వామి కి సమర్పించారు. 

మహా గణపతి శోభా యాత్ర 

టాంక్ బండ్ మీద నిమజ్జనానికి వరుస క్రమంలో కొలువు తీరి ఉన్న గణపతులను చూడటానికి భక్తులు వేలాదిగా తరలివస్తారు.  అయితే ఖైరతాబాద్ గణపతి శోభా యాత్ర మాత్రం చూపరులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.  ఈ శోభా యాత్ర  టెలిఫోన్ భవన్ వైపుగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మీరా కన్నుల పండుగగా ఉంటుంది.  హుస్సేన్ సాగర్ లో నిమమజ్జనంతో శోభ యాత్ర పూర్తి అవుతుంది.  అయితే నగరవాసులతో పాటుగా ఇతర ప్రాంతాలనుండి కూడా ఈ వేడుకను చూడటానికి తరలి వస్తుంటారు.

వినాయక చవితి నాడు చదవ వలసిన కధ అంటే శమంతకోపాఖ్యానం ఒకటే, శ్రీకృష్ణుడు కి విఘ్నేశ్వరుడికి మధ్య సంభందంతో కూడి ఉన్న శమంతకోపాఖ్యానం పరాశర మహర్షి చేత రచించబడినటువంటి విష్ణు పురాణం, వ్యాసుని చేత రచించబడినటువంటి స్కంద పురాణం శమంతకోపాఖ్యానం కి ఆధారాలు.

ఖైరతాబాద్ గణేష్ 1983 వ సంవత్యరం లో నిర్మించిన సాగర సంగమం సినిమాలో దర్శనమిస్తారని మీకు తెలుసా? తెలిస్తే ఈ వ్యాసం క్రింద కామెంట్ చేయండి.

2 thoughts on “ఖైరతాబాద్ గణేశ్ 2025

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page