వినాయక వ్రత కథ ను వినాయక చవితి రోజు తప్పకుండా చదవాలి. భాద్రపద శుక్లపక్ష చవితిని మనము వినాయక చవితిగా జరుపుకుంటాము. ఈ రోజున వినాయక వ్రత కథ చదివి అక్షంతలు తల పైన చల్లుకుంటే ఆరోజు చంద్రుని చూసినాకూడా అపనిందలు రావు. మనము వినాయకుని చవితి రోజున శమంతకోపాఖ్యానము తప్పకుండా చదవాలి. అలాగే ఈ వినాయక వ్రత కథలో చెప్పిన “సింహః ప్రసేన మవదీత్” శ్లోకాల్ని అందరూ చెప్పాలి.
వినాయక వ్రత కథ - శమంతకోపాఖ్యానము
యదువంశంలో సత్రాజిత్తు, ప్రసేనుడు అనే సోదరులు ఉండేవారు. వారు నిజ్ఞుని కుమారులు. సత్రాజిత్తు సూర్యభగవానుడి కై ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యారు. అంతట సూర్యభగవానుడిని శమంతకమణి తనకి ఇవ్వమని సత్రాజిత్తు కోరెను. సూర్యనారాయణ మూర్తి ఆయన మెడలోని శమంతకమణి తీసి సత్రాజిత్తు కిచ్చెను. ఆమణిని గురించి ఇలా చెప్పెను. ఈ దివ్యమణి పవిత్రులై ధరించవలెను. అప్పుడు ఈ మనీ రోజుకు ఎనిమిది బారువుల బంగారాన్ని అనుగ్రహిస్తుంది. ఈ శమంతకమణి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనావృష్టి, ఈతిబాధలు, అగ్ని, వాయువు, విష ప్రమాదాలు, దుర్భిక్షము మొదలైనవి ఉండవు. అపవిత్రుడై ధరించినచో ఈ దివ్యమణి మహిమ వల్ల వారే నశించిపోతారు అని సూర్యనారాయణమూర్తి తెలిపెను.
అంతట సత్రాజిత్తు ఆ మణిని స్వీకరించి ఆయన మెడలో వేసుకొని పురవీధులలో నడిచెను. ఆ దివ్యమణి కాంతుల వలన సత్రాజిత్తును చూసి ప్రజలంతా సూర్యభగవానుడే శ్రీ కృష్ణుని దర్శనం కొరకు వస్తున్నారు అనుకున్నారు. శ్రీ కృష్ణ పరమాత్మ సత్రాజిత్తు తో శమంతకమణి కనుక ప్రభువైన ఉగ్రసేన మహారాజు దగ్గర ఉన్నట్లయితే రాజ్యము సుభిక్షం అవుతుందని పలికెను. సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఆ మణిని సత్రాజిత్తు వేటకు వెళుతున్నా తన తమ్ముడైన ప్రసేనుని కి ఇచ్చాను. శ్రీకృష్ణునితో కలిసి ప్రసేనుడు వేటకి వెళ్లెను. అరణ్యంలో కొంతసేపటి తరువాత శరీర శోధన కారణం వల్ల ప్రసేనుని కి అసౌచం వచ్చెను. మణి ప్రభావంవల్ల అసౌచం వచ్చిన ప్రసేనుడు సింహం వల్ల సంహరింపబడెను. ప్రసేనుడు దగ్గరనుండి సింహం ఆ మణిని తీసుకు వెళ్ళను. ఈ సింహాన్ని జాంబవంతుడు అనే బళ్ళు కం సంహరించెను. జాంబవంతుడు ఆ మణిని తీసుకువెళ్లి తన కుమారుడైన సుకుమారుడు ఉన్న ఉయ్యాలకు ఆటవస్తువుగా కట్టెను.
శ్రీకృష్ణునిపై నీలాపనిందలు:
ప్రసేనుడు వేటకి వెళ్ళినప్పుడు శ్రీ కృష్ణుడు కూడా తనతో వెళ్లెను. ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింప బడెను. శ్రీ కృష్ణ పరమాత్మ ప్రసేనుని కై అరణ్యంలో వెతుకుతూ తలెత్తి చూడగా, ఆకాశమున శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనబడెను. బాగా చీకటిగా ఉన్న కారణం చేత శ్రీ కృష్ణ పరమాత్మ తన మందిరానికి తిరిగి వచ్చెను. ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో, ఇతః పూర్వము శమంతకమణి ఉగ్రసేనుని కి ఇవ్వమని శ్రీకృష్ణుడు అడిగారు. కాబట్టి తన తమ్ముడైన ప్రసేనుని శ్రీకృష్ణుడే చంపి ఆ మణిని దొంగిలించారని సత్రాజిత్తు ప్రచారం చేశారు.
ఈ అపవాదులు తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు, సత్రాజిత్తు బంధువులతో కలిసి ప్రసేనుని వెతకడానికి వెళ్ళను. అడవిలో శోధింప గా ఎముకలు, బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. దానిచే ప్రసేనుని, గుఱ్ఱమును ఏదో క్రూరమృగము చంపి ఉండునని కృష్ణుడు భావించెను. గుర్రపు పాదముద్రలు ఆగిపోయిన తరువాత సింహము పాదముద్రలు కనబడను. శమంతకమణి మాత్రం కనబడలేదు. దీంతో సత్రాజిత్తు బంధువులంతా శ్రీకృష్ణుడే ప్రసేనుడు ని చంపి శమంతకమణి అపహరించాడని, ఆ తరువాత సింహము ప్రసేనుడు ని గుర్రాన్ని తినేసింది అని అపవాదము వేశారు. దాంతో శ్రీకృష్ణుడు ఈ అపవాదులు తొలగడానికి మరిఇంత ప్రయత్నం చేసెను.
జాంబవంతునితో యుద్దము:
కొంత దూరం వెళ్ళాక అచట సింహము కళేబరము కనబడెను. అక్కడి నుండి బళ్ళు క పాదముద్రలు కనబడెను. శ్రీకృష్ణుడు ఇది అనుసరిస్తూ వెళ్లి ఒక గుహ లోకి ప్రవేశించారు. అక్కడ యవ్వనంలో ఉన్న ఒక ఆడపిల్ల, ఉయ్యాలలో ఉన్న సుకుమారుడుకి ఉయ్యాల ఊపుతుంది. ఉయ్యాలకు ఆటవస్తువుగా కట్టినా శమంతకమణి కృష్ణుడు చూశారు. ఆ ఉయ్యాల ఊపుతున్న జాంబవతి శ్రీకృష్ణుడి సౌందర్యమునకు వశపడెను. బహుశా ఆయన శమంతకమణి కోసమే వచ్చారని గ్రహించింది. గట్టిగా మాట్లాడితే తన తండ్రి అయిన జాంబవంతుడు వస్తారని, దానివల్ల శ్రీకృష్ణుని ఆపద కలుగుతుందని భయపడింది. పాట రూపంలో శ్రీకృష్ణుడికి శమంతకమణి గురించి వివరించెను.
శ్లో|| సింహః ప్రసేన మవదీత్,
సింహో జాంబవంతాహతః,
సుకుమారక మారోధి,
స్తవహ్యేశ స్యమంతకః
తా|| ప్రసేనుని వధించిన సింహమును, జాంబవంతుడు వధించి, శమంతకమణి తెచ్చెను. ఓ సుకుమారుడా ! ఈ మణి నీకె ఏడవకుము.
అంతలో లోపల నిద్రిస్తున్న జాంబవంతుడు లేచి వచ్చెను. శమంతకమణికై శ్రీకృష్ణుడు వచ్చెను అని శంకించి ద్వంద్వ యుద్ధముకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతారంలో జాంబవంతుని కి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతుడుకు రాముని ఆలింగనము చేసుకోవాలని కోరిక. కాని కృష్ణుడు ఆ కోర్కెను తీర్చిన కై జాంబవంతుని తో 21 రోజులపాటు యుద్ధ మొనర్చెను. క్రమముగా జాంబవంతుడి బలము తగ్గి కృష్ణుడే రాముడుని గ్రహించి ఆయన పాదాలపై పడి ప్రార్ధించెను. శమంతకమణిని తన కుమార్తె అయిన జాంబవతిని కృష్ణునికిచ్చి పంపెను.
శ్రీకృష్ణుని కల్యాణము:
ద్వారకా నగర పౌరులకు జరిగిన సత్యమును తెలిపెను. శమంతకమణి సత్రాజిత్తునకు ఇచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకొని తనను క్షమించమని ప్రార్ధించెను. తన కన్యారత్నం అయిన సత్యభామను, మణిరత్నం నైన శమంతకమణిని, గోపాలరత్నం అయిన శ్రీ కృష్ణుడి కి ఇచ్చెను. శ్రీకృష్ణుడు భూదేవి అవతారం అయినటువంటి సత్యభామను వివాహం చేసుకొని శమంతకమణి సత్రాజిత్తుకె ఇచ్చెను. జాంబవంతుడు కుమార్తె అయిన జాంబవతిని అలాగే సత్యభామలు శ్రీ కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్నారు.
ఈలోగా పాండవులు, కుంతీదేవి లక్క ఇంట్లో కాళి మరణించారన్న వార్త వచ్చెను. శ్రీ కృష్ణునికి వారు మరణించలేదని తెలుసు. కానీ ధృతరాష్ట్రుడు అనునయించి చుటకు లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురముకు వెళ్ళెను.
యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడు అను ముగ్గురు ప్రముఖులు ఉండేవారు. సత్యభామను, శ్రీకృష్ణుని కిచ్చి వివాహం చేయుటకు పూర్వము వీరి ముగ్గురిలో ఒకరికి ఇచ్చి వివాహం చేస్తానని సత్రాజిత్తు మాట ఇచ్చారు. కానీ అనుకోని పరిణామాలలో శ్రీ కృష్ణుడి కి ఇచ్చి వివాహం చేశారు. దీనివల్ల సత్రాజిత్తు పై ఈ ముగ్గురు కక్ష పెట్టుకున్నారు. కృష్ణుడు లేని సమయం చూసి సత్రాజిత్తును సంహరించి శమంతకమణిని అపహరించాడని శతధన్వుడుని ప్రేరేపించారు. శతధన్వుడు అట్లే చేసెను. ఆ శమంతకమణిని అక్రూరునికి ఇచ్చి శతధన్వుడు పారిపోయెను.
బలరాముడు శ్రీకృష్ణుని నిందించుట:
ఇది తెలుసుకున్న కృష్ణుడు హస్తినాపురం నుంచి వచ్చి సత్యభామను ఓదార్చెను. శతధన్వుడు కోసం బలరాముడు తో కలిసి రథములో బయలుదేరును. అలసి పడిపోయిన గుఱ్ఱమును వదిలేసి శతధన్వుడు, కాలినడకన పరిగెట్టాను. ఇది చూసి శ్రీకృష్ణుడు రథమును బలరాముని కి ఇచ్చి శతధన్వుడు వెనకాల పరిగెత్తి ద్వంద్వ యుద్ధము చేసి అతనిని సంహరించెను. శమంతకమణి చూడగా అది అతని దగ్గర లభించలేదు.
తిరిగి వచ్చి బలరాముడికి విషయం చెప్పగా, ఆయన కృష్ణుని నీవు బాల్యము నుండి చోరుడవు ఇప్పుడు ఆ మణిని నేనడిగింది అని శంకించి దానిని దాచావు. నీతో నేను కలిసి ఉండనూ అని బలరాముడు శ్రీకృష్ణుని నిందించి విదేహ రాజ్యమునకు వెళ్ళిపోయెను.
బాహ్యసౌచము లేక మణి ధరించిన ప్రసేనుడు మరణించెను. శ్రీకృష్ణుని అనుమానించుట వల్ల అంతఃసౌచము కోల్పోయి సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడు అయినప్పటికీ అక్రూరుడు కొంతకాలము భగవత్ విరోధిగా మారినందుకు తీర్థయాత్రలకు వెళ్లెను. కాశీ పట్టణము చేరగానే అక్రూరుని కి మనశ్శాంతి కలిగెను. శమంతకమణి వల్ల వచ్చే బంగారము దైవ కార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యసౌచము, అంతఃసౌచము కలిగిఉండడం చేత ఆ ప్రాంతంలో అతివృష్టి, అనావృష్టి, లేకుండా ప్రశాంతంగా ఉండెను.
ఇచ్చట శ్రీకృష్ణుడు బలరాముని చే నిందలు పడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరం చేరెను. ఈ మణి విషయంలో తమతండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడే ఏదో మాయ చేసేను అని సత్యభామ, జాంబవతి అనుమానించేను. శ్రీకృష్ణుడు ఈ అపనిందలు కు కారణం ఏమిటి అని ఆలోచించగా, నారద మహర్షి వచ్చి భాద్రపద శుక్ల చవితి నాడు అర్ధరాత్రి ప్రసేనుని తో అడవి కి వెళ్ళినప్పుడు చంద్రుడిని చూడటమే కారణమని ఇట్లు చెప్పెను.
విగ్నేశ్వరుడు చంద్రుని శపించుట:
వినాయకుడు అన్ని లోకాల్లో విహరించు ఒక నాడు చంద్రలోకమును చేరెను. బాహ్యమున వినాయకుడు మరగుజ్జు, లంబోదరుడు అయినప్పటికీ, హృదయమున మిక్కిలి కారుణ్యము కలదు. కానీ చంద్రుడిపైకి అందంగా ఉన్నప్పటికీ యందు దోషములు కలవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూసి వికటంబుగ నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుట కై వినాయకుడు ఎవరైనా చంద్రుడిని చూస్తే అపనిందలు తప్పవని శపించెను. దానితో జనులందరూ చంద్రుని చూడటం మానేశారు. దీనివల్ల చంద్రుడు కుంగిపోయి తాను జన్మించిన క్షీరసాగరంలో కె వెళ్ళిపోయాను.
చంద్రకాంతి లేకపోవడం వల్ల ఔషధాలు ఫలించుట మానేశాయి. దీనిచే దేవతలు, మహర్షులు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు, చంద్రుడిని భాద్రపద శుక్ల పక్ష చవితి నాడు నక్త వ్రతము చేసి, ఉండ్రాళ్లు, మోదకం, కుడుములు నివేదనగా చేసి విగ్నేశ్వరుని పూజ చేయమని చెప్పారు. అంతట చంద్రుడు ఆ వ్రతము చేయగా వినాయకుడు ప్రసన్న మయ్యారు. అప్పుడు వినాయకుడు, ఒక్క భాద్రపద శుక్లపక్ష చవితి రోజు మాత్రం చంద్రుడిని చూసిన నిందలు కలుగునని శాపవకాశము ఇచ్చెను.
శ్రీకృష్ణుడు వినాయకుని పూజించుట:
అంతట శ్రీకృష్ణుడు, భాద్రపద శుక్లపక్ష చవితినాడు తాను చంద్రుని చూడటం వల్ల కలిగిన నిందలు పోగొట్టుకొనుట విగ్నేశ్వరుని పూజించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీ కృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోతాయని మంగళకరమైన వాక్కును పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడి తిని, కానీ సామాన్యులకి ఇది ఎలా సాధ్యం, లోకం అంతటినీ అనుగ్రహించమని వినాయకుని కోరెను.
భాద్రపద శుక్లపక్ష చవితి, అనగా వినాయక చవితి నాడు తనను పూజించి, శమంతకోపాఖ్యానం కథని వినిన, చదివినా, వారు చంద్రుడిని చూసినా నీలాపనిందలు అంటావని వినాయకుడు వరమిచ్చెను
శ్రీకృష్ణుని పై నీలాపనిందలు తొలగుట:
తదుపరి ద్వారకా నగరమున క్షామమునివారణకై మహాభక్తుడైన అక్రూరుని రాక అవసరమని భావించారు. శ్రీకృష్ణుడు అక్రూరుని కి కబురు పంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారకకు వచ్చుట చే, అందరికీ శమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన అపనిందలు తొలగిపోయెను. లోపల, బయట శౌచము కల అక్రూరుడు వద్ద శమంతకమణి ఉండటం శుభప్రదమని శ్రీకృష్ణుడు తలచెను.
కావున ఈ వ్రత సమయమునందున జాంబవతి ఊయల ఊపుతూ చెప్పిన శ్లోకం అందరూ తప్పక పఠించవలెను.
సుకుమారక మారోధి, అనగా ఆ సుకుమారుడు మనమే, స్తవహ్యేశ స్యమంతకః అనగా ఇప్పుడు గోపాలరత్నం, గణేశ రత్నము, కూడా మనవై, వారి అనుగ్రహముచే ఎల్లరూ ఆయురారోగ్య ఐశ్వర్యమును పొందుతారు.
2 thoughts on “వినాయక వ్రత కథ”