మురమళ్ళ క్షేత్రాన్ని, మంచి జీవిత భాగస్వామితో పెళ్లి కావలి అని కోరుకునే ప్రతీ ఒక్కరు తప్పక వెళ్లి దర్శించుకోవాలి. ఈ క్షేత్రము ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరికి దగ్గరలోని కోనసీమ జిల్లాలో ఉంది.
శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని ఎవరు దర్శించి, ఇక్కడ స్వామి వారికి కళ్యాణం చేయిస్తారో వారికి సంవత్సరం తిరిగీ లోపల తప్పక కళ్యాణం అవుతుంది అని చెపుతారు.
ఈ క్షేత్రమ్ లోని స్వామి వారి వైభవం, ఆలయ చరిత్ర తెలుసుకుందాం. అలాగే పెళ్లికావాలి అని కోరుకునే వారు ఇక్కడ కళ్యాణం టికెట్స్ ఎప్పుడు, ఎలా బుక్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం.
వీటితో పాటు మురమళ్ళ ఎలా వెళ్లాలి అక్కడి వసతి సదుపాయాల గురించి కూడా తెలుసుకుందాం.
మురమళ్ళ దేవాలయం చరిత్ర
ఈ క్షేత్రము అసలు పేరు మునిమండలి. ఒకప్పుడు మహర్షుల సమూహంతో నిండి వున్న ప్రాంతం ఇది. ఈ మునిమండలికి దగ్గరలోనే వున్నా ద్రాక్షారామ క్షేత్రంలో దక్ష యజ్ఞం జరిగింది.
ఈ దక్షయజ్ఞం లో, తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి వల్ల, జరిగిన అవమానానికి సతీ దేవి తన శరీరాన్ని యోగాగ్ని లో విడిచి పెట్టినది. ఇది తెలుసుకున్న పరమేశ్వరుడు, తన జటాజూటం లోనుండి వీరభద్రుడిని సృష్టింపచేసారు.
వీర భద్రేశ్వర స్వామి ఆ యజ్ఞాన్ని ద్వాంసం చేసి దక్షునికి గర్వభగం చేసారు. తప్పు తెలుసుకొని క్షమించమి అడిగిన దక్షప్రజాపతిని క్షమించి పరమేశ్వరుడు యజ్ఞాన్నిపూర్తి చేయించారు.
పరమేశ్వరుని ఉగ్ర స్వరూపముగా వచ్చిన వీరభరుడిని శాంతింపచేయాలని దేవతలు అనుకున్నారు. వారు అమ్మవారిని వేడుకోగా ఆవిడి తనలోని భద్రకాళి స్వరూపాన్ని వీరభద్రుని దగ్గరకు పంపించారు.ఆ భద్రకాళి స్వరూపము ఆయనను శాంతింప లేకపోయింది.
అప్పుడు భద్రకాళి దేవి అక్కడి గోదావరిలో స్నానమాడి కన్నెపిల్లలాగా బయటకు వచ్చినది. అంతట వీర్ భద్రేశ్వరుని మనసు ఎంతో శాంతిని పొందినది. స్వామి ఆవిడను పెళ్లి చేసుకోమని అడిగెని. ఆ తల్లి ఒప్పుకున్నాక అక్కడే వున్నా మునిమండలి లో వున్న మహర్షులు మరియు దేవతలు వారికి ఒకే పీఠము పైన కల్యాణమ్ చేయించారు.
అంతట అక్కడే వారు ఒకే పీఠము పైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా వెలిసెను. అప్పటి నుండి స్వామి వారి శాంతికి కారణం అయిన కళ్యాణం ఇక్కడ నిత్యం జరుగుతుంది. అప్పుడు మునిమండలి గా పిలవబడిన క్షేత్రమే కాల క్రమేణా మురమల్లాగా మారింది.
ఆలయ విశేషాలు
ఈ క్షేత్రములో మనకు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, ఒకే పీఠము పైన దర్శనము ఇవ్వడం విశేషం. అలాగే శివాలయాలలో నిత్య కళ్యాణం చాలా అరుదుగా చూస్తాం. కానీ ఇక్కడ వున్న స్వామికి మాత్రం ప్రతీ రోజు కళ్యాణం ఎంతో విశేషంగా జరుగుతుంది.
స్వామి వారి ఆలయం శైవాగమం నియమానుసారం నిర్మింపబడినది. అంతరాలయయం లోకి వెళ్ళగానే మనకు విగ్నేశ్వరుని దర్శనం అవుతుంది. అలాగే పరమేశ్వరుని ద్వారపాలకులైనటువంటి నందికేశ్వరుడు మహాకాళుడిని కూడా చూడవచ్చు. కుడివైపుకు తిరుగుతే కాలభైరవ స్వామి మనకు దర్శనం ఇస్తారు. ఇక మనం గర్భాలయం వైపుకు వెళితే ఒకే పీఠ పైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. స్వామి వారి ఆలయం నుండి బయటకు రాగానే మనకు చండికేశ్వరుడు దర్శనం ఇస్తారు. పక్కనే నవగ్రహ మండపం కూడా చూడవచ్చు.
ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి. ఆయన ఉపాలయామిని కూడా మనం ఈ క్షేత్రములో చూడవచ్చు. నాగ రూపం లో వున్నా, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు. సంతాన సంబంధ ఇబ్బదులున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇక్కడ స్వామి వారిని పూజిస్తే మంచిదని చెపుతారు.
కళ్యాణం టికెట్స్ పూర్తి వివరాలు
ప్రతీ రోజు సాయంత్రం ఇక్కడ వున్నా స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. పెళ్లికాని వారు ఈ కళ్యాణం చేసినట్లు అయితే తప్పక పెళ్లి అవుతుంది.
కేవలం పెళ్ళే కాదు సంతానం, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం ఇలా ఏ సమస్య అయినా ఇక్కడ కళ్యాణం చేయిస్తే మంచిది.
ప్రతీ రోజు దాదాపు ఒక 27 కళ్యాణం టికెట్స్ ఇస్తారు. ఒక్క టికెట్ 1000/-. వీటిని మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఈ దేవాలయం website link ద్వారా చేసుకోవచ్చు.
మన నక్షత్రానికి ఏ రోజు మంచిదో అందులో ఉంటుంది. బుకింగ్ పూర్తి వివరాలకు కింద వున్న వీడియోని చూడండి.
ఈ కింద ఇవ్వబడిన మురమళ్ళ దేవస్థానం వారిని సంప్రదించి offline లో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
Ph: 9490111136, 08856278136
Working Times: 09:00 AM to 01:00 PM 02:00 PM to 05:30 PM
మురమల్లకు ఎలా వెళ్ళాలి
ఈ క్షేత్రానికి వెళ్ళాలి అనుకునేవారు ముందుగా అమలాపురం లేదా కాకినాడ లేదా సామర్లకోట చేరుకోవాలి. తెలుగు రాష్ట్రాలనుండి మనకు కాకినాడ లేదా సామర్లకోటకు మనకు ఎన్నో రైలు మరియు బస్సు సదుపాయాలు వున్నాయి.
అమలాపురం నుండి మురమళ్ళ 23km, కాకినాడ నుండి 42km సామర్లకోటనుండి 52 km దూరంలో వుంది. మనకి ఈ మూడు ఊర్ల నుండి మురమళ్ళకు అనేక బస్సు సదుపాయాలు వున్నాయి.
వసతి సదుపాయం
మురమళ్ళ దేవస్థానం వారి రూమ్స్ ఇక్కడ అందుబాటులో లేకపోయినా local లో కొన్ని ప్రైవేట్ హోటల్స్ వున్నాయి. శ్రీ వీరేశ్వర సాయి సదన్ అని ఒక ప్రైవేట్ hotel వుంది. ఈ హోటల్ లో మనకు AC మరియు Non AC రూమ్స్ వున్నాయి.
వీరిదగ్గర రోజుకు AC రూమ్ 1,500/- మరియు Non AC రూమ్ 1,000/- . ఈ హోటల్ స్వామి వారి ఆలయానికి సుమారుగా 500Mtrs దూరంలో ఉంటుంది. ఈ కింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి రూమ్ బుక్ చేసుకోవచ్చు.
Hotel Name: శ్రీ వీరేశ్వర సాయి సదన్
Hotel Location: Google Map
Contact Number: 8331844447, 8331944447
Website: https://sriveereswarasaisadan.com/