గరుడ గమన తవ స్తోత్రము ఎంతో శక్తివంతమైన శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రము. దీనిని శృంగేరి పీఠాధిపతులైనా శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు భారతీ తీర్థ స్వామి వారు రచించారు. ఈ స్తోత్రము నందు శ్రీమహావిష్ణువుని ఎంతో అద్భుతముగా కీర్తించారు. గరుత్మంతుని అధిరోహించిన ఆ శ్రీమహావిష్ణువుని వర్ణన చేస్తారు.
గరుడ గమన తవ స్తోత్రమును విన్నప్పుడు మనసుకి ఎంతో శాంతిని ఇస్తుంది. శ్రీ భారతీ తీర్థ స్వామి వారు ఎంతో లలితముగా ఈ స్తోత్ర రచనను చేశారు. ఎవరైనా సులభముగా ఆ శ్రీమహావిష్ణువుని కీర్తించడానికి వీలుగా ఉంటుంది.
గరుడ గమన తవ
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసిల సతు మమ నిత్యం
మనసిల సతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!
1. జలజనయన విధినముచిహరణముఖ
విబుధవినుత-పదపద్మ – 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
2.భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీ – 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
3.శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ – 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
4.అగణిత గుణగణ అశరణశరణద
విదళిత-సురరిపుజాల- 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీ తీర్థం – 2
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం !!
మమతాపమపాకురుదేవ
మమపాపమపాకురుదేవ !!
గరుడ గమన తవ అన్న ఈ స్తోత్రాన్ని ఏకాదశి రోజు కానీ, గరుడ పంచమి రోజు కానీ శనివారం రోజు కానీ లేదా ఏదైనా నైమిత్తిక తిథి నాడు కానీ పారాయణ చేయటం ఎంతో శ్రేయస్కరం.
1 thought on “గరుడ గమన తవ స్తోత్రం”