ద్రాక్షారామ భీమేశ్వరాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం. సాక్షాత్తు ఆ పార్వతీ దేవి వ్యాస మహర్షితో చెప్పినట్లు ఇలా చెప్పిందట
“అంబ పార్వతి నాతోడ ఆనతిచ్చె,
కాశి యెక్కుడు క్షేత్ర సంఘముల లోన
కాశి కన్నను యెక్కుడు గౌరవమున, భోగ మోక్ష నివాసంబు దక్షవాటి!”
దక్షారామం భోగం, మోక్షం కలిగించే పవిత్రమైన స్థలం. దక్షణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు.
దక్షారామం యొక్క చరిత్ర
పౌరాణిక కథనాల ప్రకారం, దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేసినందున ఈ ప్రదేశానికి దక్షారామం అని పేరు వచ్చింది. దక్ష ప్రజాపతి యొక్క యాగశాల ఇక్కడే ఉందని భావిస్తారు.
దక్షారామం యొక్క చరిత్ర చరిత్ర గురించి పూజ్య గురువులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చేసిన ప్రవచనని ఈ వీడియో లింక్ లో వినండి
దేవాలయ గురించి
ద్రాక్షారామ భీమేశ్వర స్వామి: 14 అడుగుల ఎత్తున్న స్వయంభు లింగం. ఈ లింగం ప్రత్యేకమైన స్ఫటిక వర్ణంలో ఉంటుంది. భక్తులు ముందుగా భీమేశ్వరలింగ పాదభాగాన్ని దర్శించుకొని తరువాత పైన భాగాన్ని దర్శించుకోవలసి ఉంటుంది.
మాణిక్యంబ అమ్మవారు: అష్టాదశ శక్తిపీఠాలలో 12వ స్థానం. మాణిక్యంబ అమ్మవారిని దర్శించుకోవడం ప్రత్యేకమైన అనుభూతి.
అశ్వత్థ వృక్షం: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈ అశ్వత్థ వృక్షం ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆకర్షణ. ఈ వృక్షం యొక్క మూలభాగంలో బ్రహ్మసూత్రములతో ఉన్నటువంటి శివలింగం మనకు దర్శనమిస్తుంది.
దక్షవాటిక: దక్ష ప్రజాపతి యజ్ఞం జరిగిన ప్రదేశం. ఈ ప్రదేశాన్ని సందర్శించడం పుణ్యప్రదం.
కాలభైరవ స్వామి: అష్ట భైరవులతో ఉన్న కాలభైరవ స్వామికి భక్తులు గారెలు మరియు బూరెల మాలను సమర్పిస్తారు.
దక్షారామం చేరుకోవడం ఎలా?
రైలు: రాజమండ్రి లేదా కాకినాడ రైల్వే స్టేషన్కు చేరుకోవచ్చు. ఆ తర్వాత బస్సు లేదా టాక్సీ ద్వారా ద్రాక్షారామం చేరుకోవచ్చు.
బస్సు: కాకినాడ లేదా సామర్లకోట బస్ స్టేషన్ నుండి ద్రాక్షారామంకు ప్రత్యక్ష బస్సులు అందుబాటులో ఉంటాయి
వసతి సౌకర్యాలు
దక్షారామం దేవస్థానం గెస్ట్ హౌస్: ద్రాక్షారామ భీమేశ్వర దేవాలయం రూమ్స్ కొరకు ఈ కింది నంబర్లను సంప్రదించండి, AC మరియు Non-AC రూమ్స్ అందుబాటులో ఉంటాయి.
దేవస్థానం గెస్ట్ హౌస్ Phone Number:
- 9989409416
- 9502314375
ప్రైవేట్ హోటళ్లు: వివిధ బడ్జెట్లకు తగిన హోటళ్లు అందుబాటులో ఉంటాయి.
దక్షారామంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు
మహాశివరాత్రి: శివరాత్రికి ప్రత్యేక ఉత్సవాలు, ఊరేగింపులు ఘనంగా నిర్వహిస్తారు అలాగే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భజనలు ఘనంగా జరుగుతాయి.
దేవి నవరాత్రి: దుర్గామాతకు ప్రత్యేక పూజలు, అలంకరణలు జరుగుతాయి.
దక్షారామం సందర్శన సూచనలు:
- శుభ్రమైన దుస్తులు ధరించండి.
- ఆలయంలో నియమాలు పాటించండి.
- కెమెరా, మొబైల్ ఫోన్లను నిషేధించిన ప్రదేశాల్లో వాడకూడదు.
- ప్రశాంతంగా, భక్తిశ్రద్ధతో దర్శనం చేసుకోండి.
- అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి.
దక్షారామం తన అద్భుతమైన చరిత్ర, ఆధ్యాత్మిక వాతావరణంతో భక్తులను ఆకర్షిస్తుంది. ఈ పవిత్రమైన స్థలాన్ని సందర్శించి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి.
ద్రాక్షరామానికి పక్కనే కేవలం 30Km దూరంలోనే వున్న మురమళ్ళ వీరేశ్వర స్వామి మరియు గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామాలయం వారి ఆలయ విశేషాలు తెలుసుకోండి