
మంగళ గౌరీ వ్రతమును, ప్రతి ఏటా కూడా శ్రావణ మాసం లో వచ్చేటటువంటి మంగళవారములు లలో సువాసినిలు చేసి సర్వమంగళ దేవతని ఉపాసన చేస్తారు. అమ్మవారుని కలశలోకి ఆవాహన చేసి పూజిస్తారు అదవా గౌరీ దేవి ప్రతిమ తో పూజిస్తారు. ఆ రోజు అమ్మవారి నామాలతో అమ్మవారికి పూజ చేసి ఆవిడ కి నైవేద్యం పెట్టి వ్రతకల్పం లో ఏ కధ అయితే చెప్పబడిందో ఆ కథను భక్తి శ్రద్దలతో విని తల మీద అక్షతలను ధరిస్తారు. సర్వమంగళ దేవత ఉపాసన చేస్తే సువసినిలు భర్త యొక్క జీవితాన్ని కాపాడుకుంటారు.
శ్రావణ మంగళ గౌరీ దేవి వ్రతమును శ్రీకృష్ణుడు ద్రౌపది దేవికి, నారద మునీంద్రుడు సావిత్రి దేవికి ఉపదేశించారు. పెళ్లి అయ్యాక ఐదు సంవత్సరములు ఈ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేసుకున్నవారికి వైధవ్యం రాదు అని శాస్త్రవాక్కు. మంగళ గౌరీ దేవి వ్రత మును వారి వారి పరంపరాగతంగా వచ్చిన విధానాలతో ఆచరించవచ్చును.
శ్రావణ మాసంలో మంగళగౌరీవ్రత లతోపాటు, వరలక్ష్మీ వ్రతముకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. వరలక్ష్మీ వ్రత విధానం కొరకు మరియు వరలక్ష్మి వ్రత కథ కొరకు ఈ లింక్ ని క్లిక్ చేయండి.